జాంబీ రెడ్డి రివ్యూ : స‌రికొత్త వినోదాన్ని అందించే ఫ‌న్ ఫిల్మ్

విడుదల తేదీ : ఫిబ్రవరి 5, 2021
రేటింగ్ : 2.75/5
నటీనటులు : తేజ సజ్జా, దక్ష నాగర్కర్
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్

చైల్ట్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, రీసెంట్ హిట్ అయిన ఓ బేబి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి నటుడిగా సక్సెస్ అయ్యాడు. హీరోగా తేజ సజ్జ మొదటి సినిమాగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అ!, కల్కి లాంటి విభిన్నమైన కథల్ని ఎంచుకునే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జాంబిరెడ్డి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సినిమా ఒపెన్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ తో స్టోరీ మొదలవుతుంది. దీంతో ఒక సైంటిస్ట్ కరోనా వ్యాక్సిన్ తయారుచేయడానికి ప్రయోగాలు చేస్తుంటారు. ఫ్రెష్ గా హీరో తేజ సజ్జా ఇంట్రో రావడం.. తేజ సజ్జ, దక్ష నాగర్కర్, కిరీటి, ఆర్జే హేమంత్ లు బెస్ట్ ఫ్రెండ్స్. వీరంతా ప్రొఫెషన్ గేమింగ్ డిజైనర్స్. ఇంతలో లాక్ డౌన్ రావడం.. ఆర్జే హేమంత్ కి పెళ్ళి కుదరడంతో అందరూ కలిసి కర్నూల్ బయలుదేరడం జరుగుతుంది. ఇంతలో అక్కడ ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తయారుచేసి ప్రజలపై ప్రయోగించడంతో అది వికటించి.. అక్కడున్న వారంతా జాంబీస్ గా మారిపోతారు. కట్ చేస్తే ఇంటర్వల్ టైంకి తేజ సజ్జ, ఆనంది, దక్ష నాగర్కర్, గెటప్ శీను, ఆర్జే హేమంత్ లు తప్ప ఊరంతా జాంబీస్ గా మారిపోతారు. ఇక ఆ జాంబీస్ దగ్గర్నుండి వీరంతా ఎలా తప్పించుకున్నారనేది కథ.
ప్లస్ పాయింట్స్ : ఇంటర్నేషనల్ గా ఎంతో క్రేజ్ ఉన్న జాంబీస్ నేపథ్యంలో సినిమాని సెలెక్ట్ చేసుకోవడం తేజ సజ్జా కు ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకి ఇంటర్వల్ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. ఇక గెటప్ శీను, అన్నపూర్ణమ్మ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. గేమింగ్ లవర్స్ ని జాంబీస్ తో జరిగే యాక్షన్ ఎపిసోడ్ అలరిస్తుంది. ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ గా అనిపించేలా సెకండాఫ్ ఉండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి నటీనటుల పెర్ఫార్మన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

మైనస్ పాయింట్స్:

సినిమా మొదట్లోనే సగటు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోకపోవడానికి కారణం ఎఫెక్టివ్ గా లేని ఫస్ట్ హాఫ్. అలాగే సాధారణ ప్రేక్షకుడు సైతం ఊహించే కథనం. సినిమా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపించే క్లైమాక్స్.

సాంకేతిక విభాగం :

ఆన్ స్క్రీన్ మీద ఉన్న అందరూ ఎలా తమ బెస్ట్ ఇచ్చి ఆడియన్స్ ని మెప్పించారో అలాగే టెక్నికల్ గా కూడా అందరూ ది బెస్ట్ ఇచ్చారని చెప్పచ్చు. మేకప్ టీమ్ అంత బాగా డిజైన్ చేయడం వలనే జాంబీస్ సెటప్ చూడటానికి ఫ్రెష్ గాను, కొత్తగానూ ఉంటుంది. విజువల్స్ కి మార్క్ కె రాబిన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. పైన చెప్పినట్టు కథ కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ అండ్ పాయింట్ బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉండాలి అనిపిస్తుంది.

తీర్పు : యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా చేసిన మొదటి సినిమా జాంబీ రెడ్డి సినిమా ముగిసే సరికి చూసిన అందరూ సెకండాఫ్ గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగానే బయటికి వస్తారు. ఓవరాల్ గా జోంబీ సెటప్ తెలుగు ఆడియన్స్ కి రిఫ్రెషింగ్ గా అనిపించడం వలన ఈ సీజన్ లో ఓ సారి చూడదగిన సింపుల్ జోంబీ ఫన్ ఫిల్మ్ అని చెప్పచ్చు.