ప్రస్తుతం ముంబై అల్ల కల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ధారావి మాత్రమే కాదు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ 19 కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అదంతా అటుంచితే ఓవైపు ముంబై – బాంద్రా లాంటి చోట కరోనా ఆటాడుకుంటోంది. అక్కడ సెలబ్రిటీల ఇళ్లలోకి తొంగి చూస్తోంది ఈ మహమ్మారీ.
ఇంటికి పనిమనుషులే కరోరాని వెంట పెట్టుకు వస్తున్నారు. గజగజ ఒణికించే మహమ్మారీ దెబ్బకు ఒణికిపోతున్నారంతా. మొన్నటికి మొన్న బోనీకపూర్ ఇంట్లో పని వాళ్లకు టెస్టులు చేయిస్తే అందులో ఇద్దరికి పాజిటివ్ ఉందని తేలడంతో ఇంట్లో అందరూ పరీక్షలు తప్పనిసరి అయ్యింది. బోనీ ఫ్యామిలీ కి పాజిటివ్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా 14 రోజుల స్వీయనిర్భంధంలోకి వెళ్లిపోయారు.
ఈ వార్త ఇలా ఒణికించగానే ముంబై బాంద్రా ఏరియా హై అలెర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. అయినా అక్కడ కరోనా ఆగడం లేదు. సెలబ్రిటీల ఇండ్లను చుట్టేస్తోందనడానికి తాజాగా కరణ్ జోహార్ ప్రకటన ప్రత్యక్ష సాక్ష్యం. కరణ్ పనోళ్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో వెంటనే ముంబై మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. అయితే కరణ్ ఫ్యామిలీకి మాత్రం కరోనా నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 14 రోజుల స్వీయ నిర్భంధాన్ని పాటిస్తున్నామని.. ఇరుగు పొరుగుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నామని కరణ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.
https://twitter.com/karanjohar/status/1264942040199999490