ట్విట్టర్ రివ్యూ : విజయ్ దేవరకొండ “లైగర్” పరిస్థితి మరీ ఇలా ఉందా..!?

ఈ ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన ఆల్ మోస్ట్ సినిమాల్లో మన టాలీవుడ్ సహా సౌత్ నుంచి వచ్చిన సినిమాలే బాగా డామినేట్ చేసి పారేశాయి. లేటెస్ట్ గా కార్తికేయ 2 సినిమా ఉత్తరాదిన అదరగోడుతుండగా దానికి మించి భారీ హైప్ తో వచ్చిన లేటెస్ట్ సినిమానే “లైగర్”.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే మాస్ దర్శకుడు పూరి జగన్నాద్ ల నుంచి వచ్చిన ఈ చిత్రం భారీ ఏక్షన్ ఎంటెర్టైనర్ లా తెరకెక్కింది. సరే ఇక ఈ సినిమాకి ఈరోజు అర్ధ రాత్రి నుంచే అనేక చోట్ల షో లు పడిపోగా ఈ సినిమా టాక్ ఏంటో ఆల్ మోస్ట్ బయటకి వచ్చేసింది.

మరి మొదటి షో చూసిన వాళ్ళు అయితే ఈ సినిమాకి ఏమంత మంచి రివ్యూస్ ఇవ్వడం లేదనే చెప్పాలి. దీనితో అయితే ఈ చిత్రానికి ఊహించని ఫలితమే దక్కేలా అనిపిస్తుంది. పూరి జగన్ టైం తీసుకొని చేసినా ఏది మారలేదని అంతా పరమ రొటీన్ గా ఉందని కథ లేదు.

హీరోయిన్ స్టోరీ కూడా పెద్దగా లేదని అరుచుకునే డైలాగ్స్ తో సినిమా బాగాలేదని అంటున్నారు. అయిత హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాకి బాగా కష్టపడ్డా సినిమాకి పూరి జగన్నాథ్ దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది అని ట్విట్టర్ పీపుల్ అంటున్నారు.

తన టేకింగ్ సినిమాలో పాటలు అసలు అన్నీ డిజప్పాయింట్ చేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఫైట్స్ విషయంలో మాత్రం మంచి ఫీడ్ బ్యాక్ సినిమాకి వస్తుంది. మరి ఇన్ని తక్కువ మంచి పాయింట్స్ తో అయితే ఈ సినిమా ఎంతవరకు గట్టెక్కుతుందో మరి..