కరోనాతో ఆర్ధికంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఇప్పట్లో కొలుకునే పరిస్థితి లేదు. వైరస్ కి వ్యాక్సిన్ వస్తే ఏడాది-రెండేళ్లలో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని పరిశ్రమలు ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి. తక్కువ సిబ్బందితోనే ఎక్కువ పనిచేయిస్తున్నాయి. తప్పదు కరోనా కష్ట కాలం కాబట్టి కంపెనీ ఇచ్చినంత తీసుకుని పనిచేయాల్సిన పరిస్థితి. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పరిస్థితి అంతకంకు ఘోరంగా తయరైంది. పరిశ్రమకు సంబంధించిన 24 శాఖలకు భారీగా కోతలు పడ్డాయి. డిమాండ్ చేసినంత నిర్మాత ఇచ్చే పరిస్థితి లేదు. పొర పాటున డిమాండ్ చేస్తే నిరభ్యంతరంగా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని చెప్పేస్తున్నారు నిర్మాతలు.
ఇప్పటికే హీరోల పారితోషికం పై నిర్మాతల సంఘం చర్చించడం జరిగింది. కోట్ల రూపాయలు చెల్లించి సినిమాలు చేయాల్సిన పరిస్థితి లేదని…పారితోషికం తగ్గించుకుని చేస్తామంటే? చేయండి లేకపో లేదనేస్తున్నారు. అయితే నిర్మాత బాగు ఆలోచించే ప్రతీ స్టార్ హీరో పారితోషికం విషయంలో భారీగానే కోతలు భరిస్తున్నారు. ఇక దర్శకుడు నిర్మాణ వ్యయం కూడా తగ్గించుకుంటు న్నాడు. ఇప్పటికే చాలా స్ర్కిప్ట్ ల్లో చాలా మంది దర్శకులు ఔట్ డోర్ షూటింగ్ లు లేకుండా లోకల్ గానే షూటింగ్ చేసుకునేలా కథలో మార్పులు, చేర్పులు చేసారు. ఇక హీరోయిన్ల విషయంలో నిర్మాతలు అందరికంటే కఠినంగా వ్యవహరిస్తున్నారుట. కోట్లు పారితోషికం అందుకున్న భామలందరి పారితోషికాలు సగానికిపైగా కోసేస్తున్నారుట.
ఇప్పటికే ఎంపికైన పలువురి స్టార్ హీరోల చిత్రాల భామల పారితోషికంపై అలాగే వేటు వేసినట్లు సమాచారం. హీరోయిన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పారితోషికం తగ్గించి..డిసైడ్ చేసిన తర్వాత ఫోన్ చేసి ఇంతే ఇస్తాం..ఇష్టమైతే చేయండి..కష్టమైతే మానేయండని నిర్మాతలు కరాఖండీగా చెప్పేస్తున్నారుట. మరో దారి లేక ఆ భామలు కూడా ఒప్పుకుంటు న్నారుట. ఒకప్పుడు నిర్మాత ముక్కు పిండి రూపాయి కూడా వదలకుండా వసూల్ చేసేవారు. కరోనా దెబ్బకి అందరి లెక్క కుదిరిందిలే.