కుటుంబ కథా చిత్రాలను ప్రతిభావంతంగా తెరకెక్కించడంలో ఆదుర్తి సుబ్బారావు ఉత్తమోత్తమ దర్శకులని చెప్పవచ్చు .తెలుగు, తమిళ, హిందీ రంగాల్లో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన సినిమాలు నేటి తరాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి . ఈరోజు ఆదుర్తి సుబ్బారావు 43వ వర్ధంతి . ఆ మహనీయ దర్శకుని గురించి తెలుసుకుందాం .
ఆదుర్తి సుబ్బారావు 16 డిసెంబర్ 1912లో రాజమండ్రిలో సత్తన్న పతులు, రాజలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు . తండ్రి రాజమండ్రి లో తహసీల్దార్ గా పనిచేసేవాడు . సుబ్బారావు ప్రాధమిక విద్యను పూర్తి చేసి కాకినాడ పీఆర్ కళాశాలో చేరాడు . ఆతరువాత ఫోటోగ్రఫీ మీద వున్నఆసక్తితో బొంబాయి లోని సెయింట్ క్సఅవిర్ కళాశాలో చేరాడు . అయితే మూడు సంవత్సరాల కోర్స్ ను రెండు సంవత్సరాల్లో పూర్తీ చేశాడు . అప్పట్లో ప్రఖ్యాతి గాంచిన బాంబే ఫిలిం లేబొరేటరీ లో చేరాడు . అక్కడ పనిచేస్తూనే దిన నార్వేకర్ అనే ఫిలిం ఎడిటర్ దగ్గర సహాయకుడిగా చేరాడు . సినిమా మీద ఇష్టంతో ఫిలిం ఎడిటర్ , సినిమాటోగ్రాఫర్ , స్క్రీన్ రైటర్ గా తన ప్రతిభతో రాణించసాగాడు . అంతటితో తృప్తి చెందకుండా దర్శకత్వ శాఖపై మనసు మళ్లింది . కల్పన అనే సినిమాతో ఉదయశంకర్ దగ్గర సహాయకుడిగా చేరి పాఠాలు నేర్చుకోసాగాడు .
1954లో ‘బాలానందం “అనే సినిమాకు సుబ్బారావు సహాయ దర్శకుడుగా పనిచేశాడు . సుబ్బారావు లోని ప్రతిభను చూసిన ఎస్ . భావ నారాయణ, డీబీ నారాయణ తమ చిత్రానికి దర్శకుడుగా నియమించారు . సాహిణి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన “అమర సందేశం ” చిత్రంలో అమర్నాథ్, శ్రీరంజని ,పద్మిని, రేలంగి , తుర్లపాటి విజయ లక్ష్మి, మిక్కిలినేని కెవిఎస్ శర్మ నటించారు . ఈ చిత్రానికి శ్రీ శ్రీ, ఆరుద్ర , తాపీ ధర్మా రావు పాటలు రాశారు . ఈ సినిమా హిందీ చిత్రం బైజు బావ్రా ప్రేరణతో తీశారు . అమర సందేశం సినిమాలో హీరో పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వర రావు ను సంప్రదించారు . అప్పుడు ఆయన కాల్ షీట్స్ సర్దలేని స్థితిలో వున్నారు . అప్పుడు అమర్నాథ్ ను తీసుకున్నారు . (అమర్నాథ్ రాజేష్ , శ్రీలక్ష్మి తండ్రి ). అలా తన తొలి సినిమాతోనే సుబ్బారావు ప్రతిభావంతుడైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు . ఆ తరువాత దుక్కిపాటి మధుసూదన రావు “తోడికోడళ్లు” చిత్రానికి దర్శకుడుగా ఏమికా చేసుకున్నాడు . ఈ చిత్రం గణ విజయం సాధించింది .
తెలుగులో ఆ తరువాత ఆడపెత్తనం , మాంగల్యబలం , నమ్మిన బంటు, ఇద్దరు మిత్రులు, కృష్ణ ప్రేమ, మంచి మనసులు, చదువుకున్న అమ్మాయిలు , మూగ మనసులు , దాగుడు మూతలు , డాక్టర్ చక్రవర్తి , వెలుగు నీడలు ,సుమంగళి, తేనెమనసులు , తోడు నీడ , కన్నె మనసులు, పూలరంగడు, సిడిగుండాలు, మరో ప్రపంచం, విచిత్ర బంధం , మాయదారి మల్లిగాడు , బంగారు కలలు , గుణవంతుడు , మహాకవి క్షేత్రయ్య , హిందీలో మిలన్, సునేహార సంసార్ , రక్ వాలా ,మస్తాన్, డోలి, మన్ కా మీట్ , దర్పణ్ ,జీత్ , ఇన్సాఫ్ , జ్వార్ భట , తమిళంలో ఎంగల్ వీట్టు మహాలక్ష్మి ,మంజాల మహిమై ,ఎంగల్ కులదేవి , పట్టాలియన్, వెట్రీ , కుముదం చిత్రాలకు దర్శకత్వం వహించాడు .
సుబ్బారావు దర్శతత్వం వహించిన చిత్రాల్లో సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి , మూగ మనసులు, నమ్మిన బంటు, మాంగల్య బలం , తోడికోడళ్లు , కుముదం చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి . డాక్టర్ చక్రవర్తి, మహాకవి క్షేత్రయ్య సుడిగుండాలు , చిత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు లభించాయి . సుబ్బారావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు .
సుబ్బారావు హీరో కృష్ణను తేనెమనసులు అనే సినిమా రంగానికి పరిచయం చేశాడు . కళాతపస్వి కె. విశ్వనాథ్ సుబ్బారావు శిష్యుడే .ఆదుర్తి సుబ్బారావు మానవతా విలువలను, మనిషి తనాన్ని , కుటుంబ గౌరవం , వుమ్మడి కుటుంబాల్లోని ఆప్యాయతలు , అను బంధాలను చాలా ప్రతిభావంతంగా తెరకెక్కించాడు . అంటే కాదు అక్కినేని నాగేశ్వర రావు తో ఆదుర్తికి విడతీయలేని అనుబంధం ఉండేది . తమలోని భావాలకు “సుడిగుండాలు “, “మరో ప్రపంచం ” చిత్ర రూపం కలిపించారు . మహాకవి క్షేత్రయ్య చిత్ర నిర్మాణంలో ఉండగానే సుబ్బారావు అస్వస్తతో ఉండి అక్టోబర్ 1, 1975లో చనిపోయారు
సున్నినమైన భావాలను, సునిశితమైన హాస్యాన్ని తెర మీద పండించిన గొప్ప దర్శకుడు . సృజనాత్మక సాకేతిక నిపుణుడు ఆదుర్తి సుబ్బారావు .
-భగీరథ