మ‌రో `ప‌వ‌ర్ స్టార్`కి ఇదే గ‌తి ప‌డుతుందా?

RGV in search of Pawan Kayaln's lookalike?

టిక్ టాక్ స్టార్ జంప‌య్యాక ఇంకెవ‌రు?

పవన్‌కళ్యాణ్‌ జీవితం ఆధారంగా పవర్‌ స్టార్‌ అనే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ఆర్జీవీ స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్జీవీ ప్ర‌క‌ట‌న ప‌వ‌న్ అభిమానులు స‌హా చాలా మందికి పెద్ద‌ షాక్‌ ఇచ్చింది. ఈ ఆక‌స్మిక ప్ర‌క‌ట‌న ప‌వ‌న్ అభిమానులను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసింది. చాలా మంది రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఈ చిత్రం 2 గంటల నిడివితో ఉండే చిత్రం కాదని.. అయితే ఇది ఒక గంట నిడివితో ఉండే లఘు చిత్రం మాత్ర‌మేన‌ని ఆర్జీవీ తెలిపారు. ఆ త‌ర్వాత పవన్ కళ్యాణ్ ని త‌ల‌పించే టిక్ టాక్ స్టార్ ని టైటిల్ పాత్ర‌కు ఎంపిక చేసుకున్నాడు ఆర్జీవీ. అనంత‌రం షూట్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. కానీ మీడియా స‌మాచారం ప్ర‌కారం.. పవన్ పాత్ర‌ను పోషించాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎటూ క‌నిపించ‌కుండా పారిపోయాడని చెబుతున్నారు.

తాజా స‌న్నివేశంతో ఆర్జీవీ ఈ చిత్రం కోసం మళ్ళీ టైటిల్ స్టార్ ని వెతికే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. అయితే ఆర్జీవీ ఎవ‌రైనా ఒక‌రిని ఎంపిక చేసినా అత‌డికి కూడా ఇదే ప‌రిస్థితి వ‌స్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ప‌వ‌ర్ స్టార్ అభిమానులు జ‌న‌సైనికులు జ‌జ్జిన‌క‌ర జ‌నారే! అంటూ శివ‌తాండ‌వం ఆడ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.