మ‌హేష్ `స‌ర్కార్ వారి పాట` లుక్ ఇదే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం టైటిల్ అధికారికంగా వెల్ల‌డైంది. స‌ర్కార్ వారి పాట అనే టైటిల్ ఖాయ‌మైంది. తాజాగా మ‌హేష్ స్వ‌యంగా టైటిల్ పోస్ట‌ర్ ని సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేశారు. లీకువీరులు ఇచ్చిన లీక్ కి త‌గ్గ‌ట్టే సర్కార్‌ వారి పాట టైటిల్ నే ఖాయం చేశారు.తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్ట‌ర్ లో మ‌హేష్ ఫేస్ క‌నిపించ‌కుండా వెన‌క భాగం మాత్ర‌మే చూపించ‌డం ఆస‌క్తిక‌రం. అక్క‌డ పోస్ట‌ర్ లో ర‌ఫ్ లుక్ తో గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. మెడపై రూపాయి కాయిన్‌ టాటూ ఉండటం ఈ సినిమాపై ఆసక్తి రేకిస్తోంది.

గీతా గోవిందం ఫేమ్‌ పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించబోతోంది. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ఈ చిత్రంలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. గోపీసుందర్‌ మ్యూజిక్‌, పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తారని వార్తలు వచ్చిన్నప్పటికీ అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఫామ్‌లో ఉన్న తమన్‌వైపు చిత్ర బృందం మొగ్గు చూపింది. అంతేకాకుండా సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌ పనిచేయనున్నారు. ఇందులో మ‌హేష్ త్రిపాత్రాభిన‌యం.. టీనేజీ లుక్ స‌ర్ ప్రైజ్ అన్న టాక్ వినిపిస్తోంది.