ఇండస్ట్రీ టాక్ : హీరోయిన్ లేని “గాడ్ ఫాదర్” లో ఆమెది చాలా కీలక పాత్ర..?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరో సినిమా వచ్చి చాలా కాలం అయ్యేసరికి ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. మలయాళ హిట్ సినిమా లూసిఫెర్ కి రీమేక్ గా తెలుగులో చాలా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది.

ఈ సినిమాలో ఎలాంటి హీరోయిన్ లేదు కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే తెలుగులో ఈమె పాత్రకి సంబంధించి చాలా కీలక జాగ్రత్తలు చేసుకొని డిజైన్ చేశారట. అంతే కాకుండా నయనతార సినిమాలో చాలా స్ట్రాంగ్ రోల్ లో ఎక్కువసేపు కనిపిస్తుందని అంటున్నారు.

దీని బట్టి అయితే నయనతార చాలా కీలక పాత్రలోనే కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించగా థమన్ సంగీతం అందించాడు అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.