సెట్ ని కూలగొట్టేస్తాం.. ‘బిగ్ బాస్’ టీమ్ కు వార్నింగ్

ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు….తనుశ్రీ దత్తా వ్యవహారం బిగ్ బాస్ కు చుట్టుకుంది. బిగ్ బాస్ నిర్వాహకులకు వార్నింగ్ లు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. వివాదాల్లో ఉన్న తనుశ్రీ దత్తాను   ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎంఎన్ ఎస్ పార్టీ కార్యకర్తలు.. ‘తనుశ్రీ ని కనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెలకమ్ చెప్పిన  పక్షంలో తీవ్ర పరిణామాలు  ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి’ అంటూ అమ్చీ  హెచ్చరికలు జారీ చేశారని వార్తలు వస్తున్నాయి.దానికి తగినట్లుగానే  రీసెంట్ గా తనుశ్రీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ ఎస్) పార్టీ వారు తనపై దాడి చేస్తామని బెదిరించారని   స్టేట్ మెంట్ విడుదల చేసింది. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఈ విషయమై మీడియావద్ద పెదవి విప్పలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు.

 ఇక ఇష్యూలోకి వెళితే.. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ పరిశ్రమకు బొమ్మ చూపెడుతున్న అంశం తనుశ్రీ దత్తా, నానా పటేకర్ల వివాదం.  అప్పట్లో ఓ పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేసే ప్రయత్నం చేశారని తనుశ్రీ ఆరోపణలు చేసారు.  అంతేకాదు ఆ టైమ్ లోనే అంటే  2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ షూటింగ్ సమయంలో ఆమెపై జరిగిన దాడి జరిగింది. ఆ దాడికి సంబందించిన వీడియో ఒకటి బయటికొచ్చింది.

అందులో ఫిల్మిస్థాన్ స్టూడియోలో తానూ, తన తండ్రి ఉన్న కారుపై కొందరు తీవ్ర స్థాయిలో దాడిచేసి అద్దాలు పగులగొట్టారు.  నానా పటేకర్ తో వివాదం మొదలైన తరవాత ఆయనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తల్ని పంపి దాడి చేయించారని తెలిపింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియో చూశాక చాలామంది తనుశ్రీకి మద్దతు తెలుపుతున్నారు.  ఈ నేపధ్యంలో మరోసారి మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ ఎస్) పార్టీ వారు వార్నింగ్ ఇచ్చారని సారాంశం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles