భాగ్యలక్ష్మి కఠోర శ్రమ ఫలించేనా?
భాగ్యలక్ష్మి అలియాస్ శ్రుతి హాసన్ లైఫ్ జర్నీ గురించి తెలిసిందే. కథానాయిక కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడే రకరకాల ప్రయోగాలు చేసింది. కెరీర్ ని, అగ్ర నాయిక హోదాని తృణప్రాయంగా త్యజించి వ్యక్తిగత జీవితం ఇంపార్టెంట్ అంటూ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం సాగించింది. అతడిని పెళ్లాడేయాల్సిందే. కానీ చివరికి అతడితో అనుబంధం తెంచుకుని తిరిగి కథానాయికగా రీఎంట్రీ ఇచ్చింది.
అయితే రీఎంట్రీ తర్వాత రాణించడం అంత సులువా? పోటీ ప్రపంచంలో తిరిగి కోల్పోయిన ఫామ్ ని తేవాలంటే చాలానే శ్రమించాల్సి ఉంటుంది. అందుకే ఇదిగో ఇలా జిమ్ముల బాట పట్టింది. ఇప్పటికే చాలానే మేకోవర్ చూపిస్తోంది. సన్నజాజి తీగలాగా తీరైన రూపంతో కనిపిస్తోంది. అందుకోసం చాలానే శ్రమిస్తోందని అర్థమవుతోంది. పైగా విదేశీ ట్రైనర్ సమక్షంలో కఠోరవ్యాయామాలు చేస్తోంది. ఇంతకీ తన కోచ్ ఎవరో తెలుసా? పేరు సిజిల్వి. తనో స్టంట్ ఉమెన్ అని శ్రుతి సమాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. మరీ అలా రెసిడెంట్ ఈవిల్ హీరోయిన్ మిలా జోవిచ్ లా .. సాల్ట్ సినిమాలో యాంజెలినా జోలీలా మారిపోతోందేమిటో!! రీఎంట్రీ ప్లాన్ గట్టిగానే ఉంది. ఇటు తెలుగు సినిమాలు – తమిళ సినిమాలతో బిజీ అవుతోంది. ఉత్తరాది పైనా ఓ కన్నేసి ఉంచింది. అందుకే ఇలా హార్డ్ వర్క్ చేస్తోందన్నమాట.