Shruthi Hassan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ప్రస్తుతం తనకంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శృతిహాసన్ తన జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కమల్ తొలి భార్య సారికకు పుట్టిన కూతుళ్లలో శ్రుతి హాసన్ పెద్దది. 1988లో కమల్-సారిక పెళ్లి జరగ్గా.. 2004లో విడిపోయారు. దీంతో తల్లితో పాటు కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ ముంబై వెళ్లిపోయారు. ఆ విషయాలను శృతిహాసన్ అందరితో పంచుకున్నారు.
నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే నా జీవితం గురించి అందరికీ తెలుసు కానీ ఇండస్ట్రీలోకి రాకముందు నా జీవితం ఎలా ఉండేదో చాలామందికి తెలియదు. అమ్మానాన్నలు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత మేము మా అమ్మతో పాటు వెళ్ళాము. అప్పటివరకు జీవితం ఒకలా ఉండేది. అమ్మ విడాకుల తర్వాత మా జీవితం ఒక్కసారిగా తలకిందులైందని తెలిపారు. అమ్మతోపాటు చెన్నై
నుంచి ముంబై వచ్చేసాం అని తెలిపారు.
అప్పటివరకు బెంజ్ కార్లలో తిరిగిన నేను లోకల్ ట్రైన్ లో తిరగాల్సి వచ్చింది.అలా రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాన్నతో ఉంటున్నాను. విదేశాల్లో సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను అంటూ తన జీవితంలో ఉన్నటువంటి రెండు దశల గురించి కూడా శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.