కోలీవుడ్ స్టార్స్ హీరో విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన నటించింది. శ్రుతి హాసన్ తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగులో శ్రుతి హసన్ నటించిన రేసుగుర్రం, గబ్బర్ సింగ్, 7th సెన్స్ వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అయితే లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో ప్రేమలో మునిగి తేలిన విషయం అందరికి తెలిసిందే. వారి ప్రేమ గురించి శృతి హాసన్ అధికారికంగా బయటపెట్టింది. ప్రేమించిన వ్యక్తి కోసం తన కెరీర్ వదులుకొని సింగర్ గా స్థిరపడాలని అతనితో కలిసి స్టేజ్ షో లు కూడా చేసింది.
అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల 2019 ఇద్దరు విడిపోయారు. ప్రేమ విఫలమైన తరువాత కొంతకాలం డిప్రెషన్ లో ఉన్న స్థితి తర్వాత క్రాక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. అప్పటి నుండీ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన కెరీర్ కి సంబంధించిన విషయాలలో పాటు పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ప్రపంచంలో మీరు బాగా ప్రేమించే వ్యక్తి ఎవరని ఓ అభిమాని అదిగిన ప్రశ్నకి సమాధానంగా..శ్రుతి తన పక్కనే ఉన్న ప్రియుడివైపు కెమెరా తిప్పి చూపించింది.
ప్రస్తుతం శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో ఉంది. గత కొంత కాలంగా వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని శ్రుతిని అడిగితే ఆమె కొంచం కంగారు పడుతున్నారు. మీ తల్లితండ్రులు విడిపోయారని మీరు భయపడుతున్నారా? అని అడిగితే నా భయానికి వాళ్ళకి సంబంధం లేదు.వాళ్ళు విడాకులుతీసుకున్నప్పటికీ వాళ్ళు కలసి ఉన్నంత కాలం సంతోషంగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఒకసారి ప్రేమ విఫలమవడంతో పెళ్ళి గురించి భయపడుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.