స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా కొత్త ప్రాజెక్ట్ లకు కమిట్ మెంట్లు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప`లో నటిస్తున్నాడు. ఇది బన్నీకి 20వ చిత్రం కావడం విశేషం. `రంగస్థలం`తో ఫామ్ లో ఉన్న సుకుమార్ డైరెక్ట్ చేయడం..`అల వైకుంఠపురములో`తో భారీ సక్సెస్తో బౌన్స్ బ్యాక్ అయిన బన్నీ నటిస్తుండటంతో భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్. శేషాచలం అడవుల్లో జరిగే గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. ఇరువురికి ఈ జానర్ తొలిసారి కావడం విశేషం. బన్నీకి ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ ఎకన్స్ పీరియన్స్ అనే చెప్పాలి.
ఇదే సమయంలో బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` ఓ స్టైలిష్ మూవీ కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. `పుష్ప` తర్వాత `ఐకాన్` నే సెట్స్ కు తీసుకెళ్లనున్నారని ప్రచారం సాగింది. కానీ ఇంతలోనే బన్నీ 21వ సినిమాగా కొరటాల ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో `ఐకాన్` కి బ్రేక్ పడినట్లు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అసలు సంగతి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఇప్పుడీ ఐకాన్ లో హీరో మారుతున్నట్లు సమాచారం. ఐకాన్ రిస్క్ ప్రాజెక్ట్ గా భావించి బన్నీ ఈ స్ర్కిప్ట్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి పంపిచినట్లు తెలిసింది.
రిస్క్ ప్రాజెక్ట్ లు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అన్నది బన్నీకి బాగా తెలుసు. `నా పేరు సూర్య` సినిమా ఆ రకంగా మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్లాప్ తర్వాత బన్నీ ప్రాజెక్ట్ బయటకు రావడడానికి రెండేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తోన్న పుష్ప కూడా రిస్కే. కానీ కమిట్ అయ్యాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాబట్టి ఎక్కడో చిన్న ఆశ. ఆ కాన్పిడెన్స్ తోనే బన్నీ ముందుకెళ్తున్నాడు. ఆ వెంటనే మళ్లీ `ఐకాన్` తో రిస్క్ తీసుకుంటే ఇబ్బందుల్లో పడతామనే ఈ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ కి రిఫర్ చేసినట్లు పరిశ్రమ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది.