‘భారతీయుడు’ కథ కు ప్రేరణ ఆ సంఘటనే

యూనివర్శిల్ హీరో కమల్‌ హాసన్‌,ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిందీ చిత్రం. ఈ చిత్రం చేయాలనే ఐడియా శంకర్ కు ఎలా వచ్చిందనే విషయం చాలా మందికి సందేహం ఉంది. ఈ విషయమై శంకర్ క్లారిటీ ఇచ్చారు.

“నేను కమ్యూనిటి సర్టిఫికేట్ , ఇనకం సర్టిఫికేట్ కోసం మా కాలేజీ రోజుల్లో ఆఫీస్ ల చుట్టూ తెగ తిరగాను. లంచం ఇవ్వనిదే పని కాదని అర్దమైంది. అది నా మనస్సులో ఉండిపోయింది. అదే నన్ను ఈ సినిమా కథ ఆలోచన దిసగా ప్రేరేపించింది ,” అన్నారు శంకర్. అలాగే ..ఇప్పుడు భారతీయడు 2 చిత్రంలో ఇప్పుడు సామాన్యుడు సమాజంలో ఎదుర్కొంటున్న ప్రతీ బర్నింగ్ ఇష్యూని చూడగలం అన్నారు.

ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్ సరసన హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది.

రెండో సారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ‘భారతీయుడు’లో కమల్ ‘సేనాపతి’ అనే ముసలివాడుగా .. ఆయన కొడుకు ‘చంద్రబోస్’గా ద్విపాత్రాభినయం చేస్తూ కనిపించారు.

ఇప్పుడు ఈ సినిమాలో ‘సేనాపతి’ మనవడిగా .. ‘చంద్రబోస్’ కొడుకుగా సిద్దార్ద గా కనిపిస్తాడని చెబుతున్నారు. చాలా విభిన్నం గా సిద్దార్ద పాత్రను శంకర్ మలిచాడని టాక్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం 8 దేశాల్లోని లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగును జరుపుకోబోతోంది. మరో ప్రక్క ఇప్పటికే ‘సేనాపతి ఈజ్‌ బ్యాక్‌’ అంటూ లుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.