‘తస్సాదియ్యా…’..దుమ్ము రేపాడయ్యా

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులోనూ రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీపై ఓ మాస్‌ సాంగ్ ని తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘తస్సాదియ్యా…’ అంటూ సాగే ఈ పాటని న్ని ఈ రోజు(17న)విడుదల చేసారు నిర్మాత డీవీవీ దానయ్య. ‘రోమియో, జూలియట్‌ మళ్లీ పుట్టినట్లు ఉంటాదంట మన జట్టు, వాళ్ల కథలో క్లైమాక్స్‌ పాజిటివ్‌గా రాసినట్లు మన లవ్‌ స్టోరీ హిట్టు..’ అని సాగే ఈ పాట ఆకట్టుకుంటోది.

Thassadiyya Song With Lyrics | Vinaya Vidheya Rama Songs | Ram Charan, Kiara Advani, Vivek Oberoi

4 నిమిషాల 25 సెకనుల నిడివితో కూడిన ఈ సాంగ్.. ఫాస్ట్ బీట్‌తో సాగిపోతూ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. వీడియోలో చెర్రీ, కియారా లుక్స్, డాన్స్ మెగా అభిమానులను కనువిందు చేస్తున్నాయి. జస్ప్రీత్ జస్జ్ పాడిన ఈ పాటలో దేవీ శ్రీ బాణీలు ఉషారెత్తిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించగా ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘తందానే తందానే..’ పాటకు మంచి స్పందన లభించింది.

స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ భామ ఈషా గుప్తా ఇందులోని స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.