ఆమె నో చెప్పింద‌ని హ‌ర్ట‌యిన సీనియ‌ర్ హీరో

ఆయ‌నో సీనియ‌ర్ హీరో. వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా సినిమాలు చేస్తున్నాడు. స‌క్సెస్ ముఖం చాటేసినా ఆయ‌నకంటూ ఓ సెక్ష‌న్ నిర్మాత‌లు ఉండ‌డంతో కెరీర్ అలా న‌ల్లేరుపై న‌డ‌క‌లానే సాగిపోతోంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ప్ర‌స్తుతం ఓ సినిమాకి ఓకే చెప్పాడు. అది కూడా వైవిధ్య‌మైన సినిమాలు తీస్తూ ఉన్న‌ ట్రెండ్ సెట్టింగ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వినిపించిన క‌థ‌కు ఓకే చెప్పాడు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ కి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం క‌థానాయిక కోసం వెతుకుతున్నారు. ఇటీవ‌ల టెంప‌ర్ మెంట్ ఉన్న రౌడీ పిల్ల‌కు ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. అయితే వేరొక ఆలోచ‌నే లేకుండా స‌ద‌రు టెంప‌ర్ మెంట్ పిల్ల నో చెప్పేసిందిట‌. అయితే రెండో ఆలోచ‌నే లేకుండా అట్నుంచి ఇలాంటి రిప్ల‌య్ రావ‌డంతో స‌ద‌రు హీరో ఫుల్ గా హ‌ర్ట‌యిపోయాడ‌ట‌. ఇక స‌ద‌రు త‌ల‌బిరుసు పిల్ల‌పై ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌లో బోలెడ‌న్ని పుకార్లు ఉన్నాయి. అలాగే వివాదాలు త‌న‌కు కొత్తేమీ కాదు. అప్ప‌ట్లో ఓ యంగ్ హీరోతో డైరెక్టుగానే కాంట్ర‌వ‌ర్శీ న‌డిపించి హాట్ టాపిక్ అయ్యింది.

ఇంత‌కుముందు ఎంద‌రో హీరోల‌కు నో చెప్పి.. పెళ్లి చేసుకుంటాన్న ప్ర‌ముఖ నిర్మాత‌కు నో చెప్పి హ‌ర్ట్ చేసింద‌న్న టాక్ కూడా ఉంది. తాజాగా సీనియ‌ర్ అని చూడ‌కుండా నో చెప్పేసి మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. 

ఏదైతేనేం.. ఇప్పుడు వేరొక హీరోయిన్ ని వెతుక్కునే ప‌నిలో స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఎంతో విసిగిపోతున్నాడ‌ట‌. చివ‌రికి త‌న ఆస్థాన నాయిక‌గా చెప్పుకునే ఓ సీనియ‌ర్ బ్యూటీతోనే స‌రిపెట్టుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. క‌థానాయిక సెట్ట‌యితే ఇక షూటింగుకు వెళ్లిపోవ‌డ‌మే ఆల‌స్యం అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో టెంప‌ర్ మెంట్ పిల్ల ఎవ‌రో.. స‌ద‌రు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సీనియ‌ర్ హీరో ఎవ‌రు? అన్న‌ది గెస్ యువ‌ర్సెల్ఫ్‌.