మృణాల్ వెంట పడుతున్న సీనియర్ హీరో.!

ఓ సీనియర్ హీరో తన కొత్త సినిమా కోసం మృణాల్ ఠాకూర్ వెంట పడుతున్నాడట. అదేనండీ, మృణాల్ ఠాకూర్‌ని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట.

గత కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడీ సీనియర్ హీరో. కెరీర్ స్థబ్ధుగా వున్న ఈ తరుణంలో సక్సెస్‌ల మీదున్న హీరోయిన్‌తో జత కడితే, కాస్తయినా ప్రయోజనం వుంటుందనుకుంటున్నాడో ఏమో కానీ, మృణాల్ పేరు పరిశీలనకు తీసుకొచ్చాడట.

అయితే, యంగ్ హీరోస్‌తో జత కడుతూ సెలెక్టివ్‌గా ముందుకు దూసుకెళుతున్న మృణాల్ అందుకు ఒప్పుకుంటుందా.? లేదా.? అనేది ఇక్కడ ఓ చిక్కు ప్రశ్న. కానీ, మృణాల్ పేరు దాదాపు ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది.

అంతేకాదు, సీనియర్ హీరోతో స్ర్కీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అప్పుడే మృణాల్‌కి దక్కడం కూడా ఓ అదృష్టమే కదా.. అన్నట్లు ఆ హీరో సొంత బ్యానర్‌లోనే ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది.

ఇంతకీ ఎవరా సీనియర్ హీరో.? ఏంటా సినిమా.? అనే వాటిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట.