2018 లో తెలుగు సినిమా .. మెరుపులు .. మరకలు 2

జులై లో  పంతం , తేజ ఐ లవ్ యు , అఘోరా , దివ్యమణి , విజేత, ఆర్ ఎక్స్  100, నివురు , లవర్, వైఫ్ అఫ్ రామ్  ,అరుంధతి అమావాస్య , ఆట కదరా శివ , పరిచయం , సాక్ష్యం , పెదవి దాటని మాట , నాకు మనసున్నాది ,హ్యాపీ వెడ్డింగ్  16 చిత్రాలు ఈ నెలలో విడుదలయ్యాయి .

గోపీచంద్ , మెహరీన్ జంటగా నటించిన పంతం సినిమాకు దర్శకుడు చక్రవర్తి కాగా నిర్మాత రాధా మోహన్ . గోపీచంద్ కు తీవ్ర నిరాశనే మిగిల్చింది .

సాయి ధర్మ తేజ్ , అనుపమా పరమేశ్వర్ తో కరుణాకర్ దర్శకత్వంలో కె .ఎస్  రామా రావు నిర్మించిన తేజ్ ఐ లవ్ యు సినిమా ఊహించని పరాజయం పొందింది . కరుణాకర్, రామారావు ఇలాంటి  సినిమా తీయడం ఊహించలేం . సాయి ధర్మ తేజ్ కెరియర్ కిది దెబ్బె .

కళ్యాణ్ దేవ్ , మాళవిక నాయర్ జంటగా వారాహి వారు  రాకేష్ శశి  దర్శకత్వంలో నిర్మించిన విజేత సినిమా కూడా నిరాశనే కలిగించింది . చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్  హీరోగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు . ఈ హీరోకు మెగా స్టార్  ఇమేజ్ ఏమాత్రం ఉపయోగపడలేదు .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , పూజ హెగ్డే  జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్  నిర్మించిన ఈ సినిమా ఊహించని ఫ్లాప్ . సాయి శ్రీనివాస్ , బెల్లంకొండ సురేష్ కు ఇది పెద్ద షాక్ .

సుమంత్ అశ్విన్ , నీహారిక కొణిదెల తో లక్ష్మణ్ కార్య  దర్శకత్వంలో సుమంత్ రాజు నిర్మించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఫర్వాలేదు అనిపించినా వసూళ్ల విషయంలో మాత్రం విజయం సాధించలేకపోయింది . మంచు లక్ష్మి , సామ్రాట్ రెడ్డి ,శ్రీకాంత్ తో నిర్మించిన విజయ్ యలకంటి దర్శకత్వంలో వివేకానంద నిర్మించిన వైఫ్ అఫ్ రామ్ సినిమా గురించి మాట్లాడుకున్న వారు లేరు . మంచు లక్ష్మి నమ్మకం వమ్మయ్యింది .

కార్తికేయ , పాయల్ రాజపుత్ తో  అజయ్ భూపతి దర్శకత్వంలో నిర్మించిన ఆర్ ఎక్స్ 100 సినిమా ఊహించని విజయం సాధించింది . చిన్న సినిమాల్లో పెద్ద విజయమని చెప్పవచ్చు . అయితే ఈ సినిమా కథ విషయంలో విమర్శలు వచ్చినా యువతీ  యువకులు బాగా ఆదరించారు .

ఆగస్టులో శివకాశీపురం , గూఢచారి , చిరంజీవి అర్జున్  లక్ష్మి సౌభాగ్యవతి , తరువాత ఎవరు ? బ్రాండ్ బాబు, మన్యం, యువతరం,శ్రీనివాస కళ్యాణం ,  ఆమె కోరిక , గీత గోవిందం , ప్రేమాంజలి , ఆటగాళ్లు , నీవెవరో ?, అంతకు మించి , నర్తనశాల , పేపర్ బాయ్ , సమీరం   17చిత్రాలు విడుదలయ్యాయి .

ఇందులో విజయ్ దేవర కొండ, రష్మిక అను ఇమ్మాయల్ తో పరశురామ్ దర్శకత్వంలో  ఉదయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించిన గీత గోవిందం సినిమా వసూళ్ల పరంగా చుస్తే టాప్ లో వుంది . ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఇమేజ్ మరింత పెరిగింది .

అడవిశేషు , జగపతి బాబు , సుప్రియ నటించిన గూఢచారి సినిమా కూడా విజయ సాధించింది . చిన్న సినిమాగా  శశికిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది . చాలా సంవత్సరాల తరువాత నాగార్జున మేనకోడలు సుమంత్ అక్క సుప్రియ ఈ సినిమాలో నటించింది . ఇదే సమయంలో సుశాంత్ నటించిన చిరంజీవి అర్జున్ సినిమా అడ్రస్ లేకుండా  పోయింది .

నితిన్ , రాశీ ఖన్నా జంటగా  సతీష్ వేగేశ్న దర్శకత్వంలో  దిల్ రాజు నిర్మించిన సినిమా శ్రీనివాస్ కళ్యాణం . ఈ సినిమా పరాజయం దిల్ రాజుకు ఊహించని దెబ్బ . గత కొన్నాళ్లుగా నితిన్ నటించిన సినిమాలు విజయవంతం కావడం లేదు . . నాగశౌర్య , కాశ్మీర తో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ఉష నిర్మించిన ఈ సినిమా పరాజయం చెందింది . నారా రోహిత్ నటించిన ఆటగాళ్లు, ఆది పినిశెట్టి ,తాప్సి నటించిన నీవెవరో  చిత్రాలు కూడా విజయవంతం కాలేదు . మిగతా సినిమాల గురించి చెప్పడానికి  ఏమిలేదు .

సెప్టెంబర్ లో కేరాఫ్ కంచర పాలెం , సిల్లీ ఫెలోస్ , ప్రేమకు రెయిన్  చెక్ , అనువంశీకత , సాగిపో నేస్తమా , మను , ఎందుకో ఏమో , శైలజా రెడ్డి అల్లుడు , యు టర్న్ , మాసకాలి , ఐన్దవి , నేను నాదేశం, నన్ను దోచుకుందువటే , ఈ మాయ పేరేమిటో , అంతర్వేదం , అలా జరిగింది , దేవదాసు , నాటకం  18 చిత్రాలు విడుదలయ్యాయి .

చిన్న చిత్రాల్లో కేరాఫ్ కంచర పాలెం సినిమా ఊహించని విజయం సాధించింది . అమెరికా  నుంచి వచ్చిన పరుచూరి విజయ ప్రవీణ మహా వెంకటేష్ దర్శకత్వంలో అందరు కొత్త నటి నటులతో ఈ సినిమా నిర్మించారు .  నాగార్జున , నాని , రష్మిక తో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మించిన దేవదాస్ పెద్ద ఫ్లాప్ . నాగ చైతన్య , రమ్య కృష్ణతో నిర్మించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా మొదట ఫర్వాలేదని అనుకున్నా , వసూళ్ల విషయంలో వెనుకబడింది . ఇక సమంత ప్రధాన పాత్రలో  పవన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యూ టర్న్ అపజయం పాలయ్యింది . కన్నడంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు .

సుధీర్ బాబు , నభా  నటించిన నన్ను దోచుకుందువటే సినిమా బాగుందని అన్నా  కలెక్షన్స్ రాలేదు .  ఆర్ ఎస్  నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు ఈ సినిమా నిర్మించాడు . అల్లరి నరేష్, సునీల్ నటించిన సిల్లీ ఫెలోస్ సినిమా నిరాశనే మిగిల్చింది . భీమినేని శ్రీనివాస రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . అక్టోబర్ లో , నోటా, భలే మంచి చౌక బేరం , విశ్వాపురం, అరవింద  సమేత వీర రాఘవ , బేవార్స్ , మూడు పువ్వులు ఆరు కాయలు, నీ ప్రేమ కోసం , హలో గురు ప్రేమ కోసమే , పందెం కోడి -2, బంగారి బాలరాజు , వీరోభోగ  వసంతరాయలు , రథం , 2 ఫ్రెండ్స్ , తాంత్రిక 14 సినిమాలు విడుదలయ్యాయి.

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , మెహ్రీన్ కౌర్ జంటగా జ్ఞానవేలు రాజా తెలుగు తమిళంలో నిర్మించిన నోటా సినిమా విజయం సాధించలేదు . తమిళంలో పర్వాలేదని అన్న తెలుగులో మాత్రంప్రేక్షకులు ఆదరించలేదు . రామ్ ,అనుపమ పరమేశ్వర్ నటించిన హలో ప్రేమ కోసం సినిమా నిరాశ పరిచింది .  త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలోదిల్ రాజు  నిర్మించిన ఈ సినిమా అపజయం పొందింది . నారా రోహిత్, సుధీర్ బాబు ,శ్రేయ నటించిన ఈ సినిమాకు ఇంద్రసేన  దర్శకుడు కాగా అప్పారావు నిర్మాత . ఈ సినిమాతో నారా రోహిత్ ఇమేజ్ పూర్తిగా పడిపోయింది .  విశాల్ , వర  లక్ష్మి  జంటగా లింగు స్వామి దర్శ కత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు .

ఈ నెలలో వచ్చిన సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మించిన అరవింద సమేత  వీర రాఘవ సినిమా ఘన విజయం సాధించింది . అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో  ఊపిరి పీల్చుకున్నాడు . జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు నటన ఈ చిత్రంలో విమర్శకుల ప్రశంసలందు కుంది . మిగతా సినిమాల గురించి చెప్పుకున్నవారు లేరు .

నవంబర్ లో సవ్యసాచి , దేశదిమ్మరి , రెడ్ మిర్చి ,కథానాయకుడు , అదుగో, కర్త కర్మ క్రియ , అంతా విచిత్రం , అమర్ అక్బర్  ఆంథోనీ , టాక్సీవాలా , శరభ , రంగు, సైన్యం, లా, రూల్ , 24 కిస్సెస్ , స్టూడెంట్ పవర్  17 చిత్రాలు విడుదలయ్యాయి 

నాగ చైతన్య , మాధవన్, నిధి అగర్వాల్ ,భూమిక నటించిన ఈ సినిమాకు  చందు మొండేటి దర్శకుడు యలమంచిలి రవి శంకర్ నిర్మాత . ఈ సినిమా గురించి ఎంతో ఊహించారు  . కానీ నాగ చైతన్యకు  నిరాశనే  మిగిల్చింది .

రవి తేజ, ఇలియానా తో శ్రీను వైట్ల దర్శకత్వంలో యలమంచిలి రవి శంకర్ నిర్మించిన ఈ సినిమా ఊహించని పరాజయం . రవితేజ సినిమా ఇంత ఘోర పరాజయం పొందటం అతని ఇమేజ్ ని చాలా డామేజ్ చేసింది .

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ దేవర కొండ , ప్రియాంక , మాళవిక  నటించిన టాక్సీవాలా సినిమా విజయం సాధించింది . అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో రావడంతో నిర్మాతలు ఆందోళన చెందారు . అయినా సినిమా ను ప్రేక్షకులు ఆదరించారు . మిగతా సినిమాలు విడుదలై  ఏమాత్రం ఆడలేదు . 

ఇక  డిసెంబర్లో  ఆపరేషన్ 2019, సుబ్రమణ్యాపురం , నెక్స్ట్ ఏంటి ? శుభ లేఖలు , కవచం , హుషారు ,అనగనగ ఓ ప్రేమ కథ , భైరవ గీత , అయ్యప్ప అనుగ్రహం  సినిమాలు ఇప్పటివరకు విడుదలయ్యాయి . ఎన్నికలకు ముందు విడుదలైనశ్రీకాంత్  ఆపరేషన్ 2019 సినిమా రాజకీయ సినిమాగా విజయవంతం అవుతుందని అనుకున్నారు . శ్రీకాంత్ కూడా ఈ సినిమాపై ఆశలు  పెట్టుకున్నాడు . సినిమా ఊహించని పరాజయం పొందింది . ఇక  సుమంత్ , ఈశా  నటించిన సుబ్రమణ్యాపురం రెండోరోజునే ఫ్లాప్ అన్నారు . సుమంత్  సినిమా జీవితం ఏమాత్రం ఆశాజనకంగా లేదు .  సందీప్ కిషన్ నటించిన నెక్స్ట్  ఏంటి సినిమా పరాజయం పాలయ్యింది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ నటించిన కవచమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  నవీన చౌదరి రూపొందించిన ఈ సినిమా ఊహించని ఫ్లాప్ . ఇందులో శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించాడు . ఈ సినిమా అయినా నిలబెడుతుంది ఆశించాడు . కానీ నిరాశనే మిగిల్చింది . బెక్కం వేణుగోపాల్ , శ్రీహర్ష దర్శకత్వంలో నిర్మించిన హుషారు పర్వాలేదు . సిద్దార్థ  భాస్కర్ నిర్మించిన భైరవ గీత సినిమా కూడా ఫ్లాప్ .

2018 సంవత్సరంలో  తెలుగులో నేరుగాను , డబ్బింగు కలిపి ఇప్పటికి 162 చిట్టాలు విడుదలయ్యాయి . సక్సెస్  రేటు చూస్తే  15 శాతం మించలేదు . సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి . అయినా నిర్మాణం ఆగడం లేదు . నిర్మాతలు , దర్శకులు, నటి నటులు ఏమాత్రం ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు .

ఇప్పుడున్న సినిమా ఏమాత్రం  ఆరోగ్యంగా లేదనే చెప్పాలి

– భగీరథ