2018 లో తెలుగు సినిమా .. మెరుపులు .. మరకలు 1

ఈ సంవత్సరం తెలుగు సినిమాల జయాపజయాల గురించి తెలుసుకుందాం !

జనవరి మాసంలో సారధి , చిలుకూరి బాలాజీ , అజ్ఞాతవాసి , జైసింహ , రంగులరాట్నం , ఇగో , ముక్తి , భాగమతి , 8 చిత్రాలు విడుదలయ్యాయి. పవన్ కళ్యాణ్ , అను ఇమ్మాన్యుల్ , కీర్తి సురేష్ తో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు . ఘన విజయ సాధిస్తుందని ఊహించిన ఈ సినిమా తీవ్ర నిరాశ పరిచింది . పవన్ కళ్యాణ్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది .

బాలకృష్ణ ,నయనతార నటించిన “జైసింహ ” సినిమా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి . కళ్యాణ్ నిర్మించాడు . యాక్షన్తో నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది . బాలకృష్ణ తనదైన మార్క్ చిత్రంగా పేరు తెచ్చుకుంది .
అక్కినేని నాగార్జున నిర్మించిన “రంగుల రాట్నం ” చిన్న సినిమా ను శ్రీరంజని దర్శకత్వం వహించగా రాజ్ తరుణ్, చిత్ర ఛుక్లా నటించారు . ఈ సినిమా ఓహొ అనిపించకపోయినా పర్వాలేదు .

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన “భాగమతి ” సినిమా విజయం సాధించింది . అశోక్ దర్శకత్వంలో వంశీ కృష్ణా రెడ్డి నిర్మించాడు . అనుష్క గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ చిత్రం నిలబడదు . మిగతా చిత్రాలు ఫ్లాఫ్ ఖాతాలో ప్ వెయ్యవచ్చు .

ఫిబ్రవరిలో ఏ బీడీ , చలో , టచ్ చేసి చూడు , హౌరా బ్రిడ్జి , గాయత్రి , ఇంటిలిజెంట్ , తొలిప్రేమ , ఇది నా లవ్ స్టోరీ , అ , సోడా గోళీసోడా , రచయిత , మనసుకు నచ్చింది , జువ్వ, రా రా , చల్తే చల్తే , హైదరాబాద్ లవ్ స్టోరీ ,16 చిత్రాలు విడుదలయ్యాయి .

నాగశౌర్య , రష్మిక జంటగా నటించిన “చలో ” చిత్రం ఫర్వాలేదని చెప్పవచ్చు . వెంకట్ కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా నాగశౌర్య స్వంత సినిమా . రవితేజ, రాశిఖన్నా , సీరత్ కపూర్ తో నల్లమలుపు బుజ్జి వివేక్ సిరికొండ దర్శత్వంలో నిర్మించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది . మోహన్ బాబు ,విష్ణు , శ్రీయ తో మదన్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఊహించని ఫ్లాప్ . మోహన్ బాబును హీరోగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లేదని అర్ధమైంది . సాయి ధరమ్ తేజ , లావణ్య త్రిపాఠి తో వినాయక్ దర్శకత్వంలో సి .కళ్యాణ్ నిర్మించిన “ఇంటెలిజెంట్ ” చిత్రం ఊహించని పరాజయం పొందింది . సాయి ధర్మ తేజకు పెద్ద షాక్ .

వరుణ్ తేజ్, రాసి ఖన్నాతో వెంకట్ అట్లూరి దర్శత్వంలో బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కూడా పెద్ద ఆశాజనకంగా ఆడలేదు . నాని ప్రయోగాత్మకంగా నిర్మించిన “అ ” చిత్రం ఫర్వాలేదనిపించింది . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంతి ఈ సినిమా నిర్మించారు . ఇదొక విభిన్నమైన సినిమా . ఇక మిగతా సినిమాలు విజయవంతం కాలేదు .

మార్చిలో ఏమంత్రం వేశావే , కిర్రాక్ పార్టీ , వదిన , నెల్లూరు పెద్ద రెడ్డి, నా రూటే సపరేటు , అయితే , మనసైనోడు ,నీది నాది ఒకే కథ , అనగనగా ఒక ఊళ్ళో , రాజ రథం , ఎమ్మెల్యే ,మర్లపులి , రంగస్థలం 13 చిత్రాలు విడుదలైయ్యాయి . ఇందులో రామ్ చరణ్ , సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకుడు . ఈ సినిమా ఊహించని విజయాన్ని సాధించింది . ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ మారుమ్రోగిపోయాయి . రామ్ చరణ్, సమంత , సుకుమార్కు మంచిపేరు తెచ్చిపెట్టిన ఈ సినిమాను యలమంచిలి రవిశంకర్ నిర్మించాడు .
పెళ్లి చూపులు , అర్జున రెడ్డితో యువతరాన్ని బాగా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ నటించిన “ఏమంత్రం వేశావే ” సినిమా ఊహించని పరాజయం పాలయ్యింది .

నందమూరి కళ్యాణ్ రామ్ , కాజల్ అగర్వాల్ నటించిన ఎమ్మెల్యే సినిమా యావరేజ్ అని చెప్పవచ్చు. ఇక మిగతా సినిమాలు ఈ మాత్రం ఆశాజనకంగా లేవు. కిర్రాక్ పార్టీ సినిమా యూతు నచ్చుతుందని భావించారు కానీ వారి అంచనా నిజం కాలేదు .

ఏప్రిల్ లో చల్ మోహన్ రంగ, సత్య గ్యాంగ్ , ఇంతలో ఎన్నెన్ని వింతలో , కృష్ణార్జున యుద్ధం , అమీర్ పెట్ తో అమెరికా , భరత్ అనే నేను , ఆచారి అమెరికా యాత్ర , కణం , .వూళ్ళో పెళ్ళికి కుక్కల… ,ఎందరో మహాను భావులు జుంక్షన్లో జయమాలిని , 11 సినిమాలు విడుదలయ్యాయి .

నితిన్, మేఘా ఆకాశ్ నటించిన చల్ మోహనరంగ సినిమా నిరాశ పరిచింది . కృష్ణ చైతన్య దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి నిర్మించాడు . స్వంత సినిమా ను కూడా విజయవంతం చెయ్యలేకపోయాడు నితిన్ . నాని , అనుపమ పరమేశ్వర్ నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఊహించని ఫ్లాప్ . ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు . మంచు విష్ణు , ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఆచారి అమెరికా యాత్ర సినిమాకు నాగేశ్వర రెడ్డి దర్శకుడు . ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు . విష్ణు కు ఊహించని మరో పరాజయం .

మహేష్ బాబు , కైరా అద్వానీ నటించిన భారత అనే నేను చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించాడు . డి .వి .వి దానయ్య నిర్మించిన ఈ సినిమా శివకు మహేష్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చింది . విడుదలైన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది . మిగతా సినిమాలు షారా మామూలే !

మే లో నా పేరు సూర్య , మహానటి , మెహబూబా , అన్నదాతా సుఖీభవ , శీనుగాడు ప్రేమ , సహచరుడు , అమ్మమ్మగారిల్లు ,నెల టిక్కెట్ 8 చిత్రాలు విడుదలయ్యాయి . అల్లు అర్జున్ , అను ఇమ్మాయిల్ తో వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీష్ నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశించారు . గతంలో ఎన్నో కథలు అందించిన వక్కంతం దర్శకుడుగా మాత్రం విజయం సాధించలేదు .

పూరి జగన్నాథ తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మించిన మెహబూబా సినిమా పూరికి పెద్ద షాక్ . పూరి అతి నమ్మకం దెబ్బతీసింది. రవితేజ , మాళవిక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాంప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నిఱషనే మిగిల్చింది . హీరో రవితేజ కు మరో ఫ్లాప్ చిత్రం .

ఇక ఈ నెలలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా మహానటి . కీర్తి సురేష్ ,సమంత, విజ దేవరకొండ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో శేషు ప్రియాంక నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు సృష్టించింది . కీర్తి సురేష్ కు ఈ సినిమాతో మరింత గౌరవం పెరిగింది . మహానటి సావిత్రి జీవిత కథ తో నిర్మించిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు . మిగతా సినిమాలు ఎలాంటి ప్రభావం చూపించలేదు .

జూన్ మాసంలో , రాజుగాడు , ఆఫీసర్ , బెస్ట్ లవర్స్ , నా నువ్వే , దేశముదుర్స్ , సమ్మోహనం ,జంబలకిడి పంబ , నా లవ్ స్టోరీ , ఈ నగరానికి ఏమైంది ? మిస్టర్ హోమానంద్ , కన్నుల్లో నీరూపమే , ఐ పి సి సెక్షన్ , సూపర్ స్కెచ్ , సంజీవని ,శంభో శంకర . 15 చిత్రాలు విడుదలయ్యాయి .

నాగార్జున , మైరా సరీన్ జంటగా రామ్ గోపాల్ వరమా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని పరాజయం పాలయ్యింది . అటు రాము , ఇటు నాగార్జునకి షాక్ . వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకులు తిరస్కరించారు .  సుధీర్ బాబు , అతిధి రావు హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విజయం సాధించింది . సుధీర్ బాబు , మోహన్ కృష్ణకు మంచి పేరు వచ్చింది .

టివి నటుడు శకలక శంకర్ హీరోగా సాయి కార్తీక దర్శకత్వంలో రమణ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఊహించని పరాయం పొందింది .  మంచి కథ ;లేకుండా , కేవలం నటీనటుల కాంబినేషన్ తో సినిమాలు విజయ వంతం కావని మరోసారి రుజువయ్యింది . ఈ ఆరు నెలల్లో పది పదిహేను శాతానికి మించి సినిమాలు విజయం సాధించలేదు .

(జులై నుంచి డిసెంబర్ వరకు విడుదలైన సినిమాల గురించి రేపు )