పికాసో.. ర‌వి వ‌ర్మ‌కు చిక్క‌ని అందాలు ఇవిగో

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

బాలీవుడ్ హాట్ బాంబ‌ర్ ఊర్వ‌శి రౌతేలా గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. హేట్ స్టోరి 4 .. గ్రాండ్ మ‌స్తీ చిత్రాల‌తో ఈ అమ్మ‌డు అగ్గి రాజేసింది. బికినీ వేర్.. టైట్ ఫిట్ లుక్ లో హీటెక్కించ‌డం లో ఈ అమ్మ‌డిని కొట్టేవాళ్లే లేరు. ఇటీవ‌లి కాలంలో అందాల ఆర‌బోత విష‌యంలో ఊర్వ‌శి హ‌ద్దు మీరుతున్న సంగ‌తి చూస్తున్న‌దే. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో ఫోటోషూట్ల‌తో హీటెక్కించేస్తోంది.

తాజాగా మ‌రోసారి అదిరిపోయే ఫోటోని ఊర్వ‌శి ఇన్ స్టాలో షేర్ చేసింది. పికాసో చెక్కిన శిల్ప‌మా.. ర‌వివ‌ర్మ తీర్చిదిద్దిన రొమాంటిక్ అంద‌మా? అన్నంత టెంప్టింగ్ గా క‌నిపిస్తోంది ఈ ఫోటోలో. ఊర్వ‌శి థై షోని ఎలివేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. మ‌రోవైపు ఊర్వ‌శి సిటీమార్ చిత్రంతో గోపిచంద్ స‌ర‌స‌న నాయిక‌గా ఇంట్ర‌డ్యూస్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

యాథృచ్ఛిక‌మో ఏమో కానీ.. సేమ్ డే అందాల తాప్సీ ప‌న్ను.. లేటెస్ట్ థై షో ఫోటో వైర‌ల్ గా మారింది. థై షోలో ఊర్వ‌శికి పోటీనా? అన్నంత‌గా చెల‌రేగింది తాప్సీ. ప్ర‌ఖ్యాత మ్యాన్స్ వ‌ర‌ల్డ్ ఇండియా ..క‌వ‌ర్ పేజీకోసం ఇచ్చిన ఫోజు ఇది. బాలీవుడ్ లో తాప్సీ ఇమేజ్ అంత‌కంత‌కు రైజ్ అవుతోంది. ఆ క్ర‌మంలోనే సొంతంగా స్క్రిప్టులు కూడా రాస్తోంది తాప్సీ. ఈ విష‌యంపైనే క‌వ‌ర్ స్టోరీని మ్యాన్స్ వ‌ర‌ల్డ్ మ్యాగ‌జైన్ ప్ర‌చురిస్తోంది.