కోన వెంకట్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ఇప్పట్లో లేనట్టేనా ..?

అన్నీ భాషల్లో బయోపిక్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వచ్చిన దంగల్ సినిమా తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో బయోపిక్స్ కి బాగా ఆదరణ పెరిగింది. బాలీవుడ్ లో దంగల్ తర్వాత హృతిక్ రోషన్ సూపర్ 30, అలాగే ప్యాడ్ మాన్ లాంటి సినిమాలు వచ్చాయి. లాగే కపిల్ దేవ్ బయోపిక్ 83 కూడా తెరకెక్కింది. ఇక సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

83 Movie Box Office collection | Hit or Flop

కాగా తెలుగులో కూడా మహానటి సావిత్రి జీవిత కథ ని మహానటి గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమా భారీ హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఎన్.టి.ఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అన్న సినిమాని తీశాడు. ఈ క్రమంలో కోలీవుడ్ లో అమ్మ జయలలిత బయోపిక్ ని కూడా రూపొందిస్తున్నారు.

కాగా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా జూన్ 1 న బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్టు దర్శక, రచయిత, నిర్మాత కోన వెంకట్ వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.

Biopic on Karnam Malleswari to be made in three languages | Tamil Movie  News - Times of India

అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కాని క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పాత్రలో మాత్రం తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ద కపూర్ నటించబోతుందంటూ పలు వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఈ పాత్రలో నటించే హీరోయిన్ ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ ఉందా.. లేక మిడిల్ డ్రాపయ్యారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కోన వెంకట్ నిర్మాణం లో అనుష్క నటించిన నిశ్శబ్ధం ఇటీవలే ఓటీటీ లో రిలీజైంది.