ముంబై బాంద్రా.. పాళి హిల్ ఏరియాలు అల్ల్రా రిచ్ సెలబ్రిటీ భవంతులు(నివాసాలు).. ఆఫీస్ కార్యాలయాలతో నిరంతరం కళకళలాడుతుంటాయన్న సంగతి తెలిసిందే. అలాంటి చోట ఓ ఆఫీస్ కం స్టూడియో ని నిర్మించడం అంటే ఆషామాషీనా? కానీ క్వీన్ కంగన రనౌత్ ఏ ఇతర స్టార్ హీరోకి తగ్గని రీతిలో తన సొంత ఆఫీస్ ని పాళి హిల్ ఏరియాలో నిర్మించుకుంది. ఇక దీనిని పునర్మించేందుకు ఇటీవల కంగన పెట్టిన పెట్టుబడి ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. సబ్నమ్ గుప్తా ఈ డ్రీమ్ స్టూడియో కం ఆఫీస్ ని డిజైన్ చేశారు.
బాంద్రా సబర్బన్ ఏరియా పాళి హిల్ లో అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించేందుకు ఏకంగా 48 కోట్ల బడ్జెట్ ని పెట్టింది క్వీన్. ఇక ఈ ఇంటిని యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్- ఇంటీరియర్ & ఎక్స్ టీరియర్ తో కళ్లు చెదిరే రేంజులో నిర్మించింది. ఆ ఇంటి లోపల… ఇంటి వెలుపలు లుక్ డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే. కంగన అంత రిస్క్ చేసి డబ్బును మంచి నీళ్లలా ఎందుకు ఖర్చు చేసింది? అంటే దానికి సమాధానం ఆ కార్యాలయాన్ని సందర్శించడమే. బాలీవుడ్ లో స్టార్ హీరోలకు ధీటుగా ఆర్జిస్తోంది. దాంతో సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. ఇందులో పాళి హిల్ ఆఫీస్ ఒక భాగం మాత్రమే. తనకు మనాలి హిల్ స్టేషన్ లో చెక్కతో నిర్మించిన అద్భుతమైన ఓ ఇల్లు ఉంది. దీనికోసం అప్పట్లో 25 కోట్లు పైగా ఖర్చు చేసిందని చెప్పుకున్నారు. ఇలాంటి ఆఫీసులెన్నో కంగన మునుముందు ప్రారంభించనుందట. క్వీన్ ప్రస్తుతం దివంగత తమిళ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తలైవి లుక్ కూడా ఇప్పటికే రిలీజైంది.
#KanganaRanaut’s never-seen-before dream studio in Mumbai, designed by #ShabnamGupta of #TheOrangeLane.
Here’s a #sneakpeek into the studio. Explore the open-to-sky cafe on the ground level & Kangana’s private workspace on the top floor#ManikarnikaFilms @elledecorindia pic.twitter.com/9uAGJ1mayb— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) May 26, 2020