కోడ‌లు అయ్యాకా మ‌రీ ఇంత‌గా చెల‌రేగిపోవాలా పీసీ?

Priyanka Chopra

అమెరిక‌న్ సింగర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా అటుపై అత్తారింటికే అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ లో స్థిర‌ప‌డేందుకు అక్క‌డే ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేస్తోంది. ఓవైపు క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తున్నా అమెరికా విడిచి రాలేదు. అక్క‌డే భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి స్వీయ‌నిర్భంధంలో రొమాన్స్ ని ఆస్వాధిస్తోంది.

ఇటీవ‌లి కాలంలో క్వారంటైన్ సెల్ఫీలు.. ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తూ ఇన్ స్టాలో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. లేటెస్టుగా ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ అప్ డేట్స్ అందిస్తోంది. అదంతా సరే కానీ.. లేటెస్టుగా పీసీ షేర్ చేసిన ఫోటో చూశాక యూత్ ఒక‌టే వేడెక్కించే కామెంట్లు పెడుతున్నారు. పీసీ ఇన్న‌ర్ అందాల్ని ఆరాంగ ఆర‌బోసింది ఈ ఫోటోలో. ఓ ఇంటికి కోడ‌లు అయినా .. మ‌రీ అంత‌గా చెల‌రేగిపోతోందేమిటి? అంటూ నెటిజ‌నులు ఈ పోటోకి కామెంట్లు పెడుతున్నారు. ఇది 120 డిగ్రీల కోణంలో తీసిన ఫోటో. ఇందులో పింక్ బికినీ హొయ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. క్వాంటికో సిరీస్ త‌ర్వాత పీసీ వేరొక సూప‌ర్ హీరో ఫ్రాంఛైజీకి సంత‌కం చేసింద‌ని ప్ర‌చార‌మైంది. అయితే దానికి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.