సొట్ట బుగ్గల సోయగం ప్రీతి జింతా గురించి పరిచయం అవసరం లేదు. రాజకుమారుడు చిత్రంతో రెండు దశాబ్ధాల క్రితమే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వెంకీ సరసన `ప్రేమంటే ఇదేరా` అనే చిత్రంలో నటించింది. మహేష్ .. వెంకీ లాంటి టాప్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత హిందీ చిత్రసీమలోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలతో అలరించింది.
కింగ్ ఖాన్ షారూక్ నటించిన దిల్ సే (ప్రేమతో) చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైంది. తొలి సినిమాలో సహాయనటిగా కనిపించింది. ఆ తర్వాత షారూక్ సరసనే అవకాశం అందుకుంది. అగ్ర నాయికగా ఎదిగిన తర్వాత జీన్ గూడే అనే విదేశీతో ప్రేమలో పడింది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ వోనర్ గా ప్రీతి సందడి తెలిసిందే. అదంతా సరే కానీ తాజాగా ప్రీతిజింతా లేటెస్ట్ ఫోటోషూట్ వీడియో అంతర్జాలంలో వేడి పుట్టిస్తోంది.
ప్రాజెక్ట్ సానిటీ పేరుతో మాస్క్ ధరించి ప్రీతి పింక్ డిజైనర్ డ్రెస్ లో దుమారం రేపింది. ప్రీతి జింతా స్టన్నింగ్ లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ప్రీతి జింతా కంటే సీనియర్ అయిన కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసక్తికర పాత్రలు పోషిస్తున్నా ప్రీతి ఎందుకనో నటనకు దూరంగా ఉండిపోయింది. తిరిగి టాలీవుడ్ లో కనిపిస్తుందేమో చూడాలి.
Behind the scenes for #ProjectSanity ❤️ #Fashion #Shoot #Ting 🤩 pic.twitter.com/zJSIAXJGqe
— Preity G Zinta (@realpreityzinta) August 6, 2020