రాఖీ సావంత్ కు తనుశ్రీ బిగ్ షాక్

భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమాన్ని హీటెక్కించిన నటి తనుశ్రీ దత్తా. బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఈ ఆరోపణల తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలు ‘మీ టూ’ అంటూ ముందుకు వస్తున్నారు.

ఆమెను స్ఫూర్తిగా తీసుకుని పలువురు ముందుకొచ్చి మాట్లాడుతూ ఆమెను మెచ్చుకుంటుంటే మరి కొందరు మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి రాఖి సావంత్, తనుశ్రీ పై మరోసారి విమర్శలు చేసారు. ఆమె చెప్పేవన్నీ అవాస్తవమని, ఆమెకు పిచ్చిపట్టిందని విమర్శించారు. ఆమె చేసిన ఈ విమర్శల నేపథ్యంలో రాఖి సావంత్ పై భారీ పరువు నష్టం దావా వేశారు తనుశ్రీ. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

“నానా పటేకర్, గణేష్ ఆచార్యపై తనుశ్రీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆమెకు పిచ్చిపట్టింది. పదేళ్లుగా కోమాలోనే ఉంది. ఈమధ్యనే కోమా నుండి బయటకు వచ్చింది. సినిమా అవకాశాలు లేక డబ్బు కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోంది” అంటూ రాఖి సావంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“హార్న్ ఓకే ప్లీజ్” సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే తాను ఆ సినిమా నుండి బయటకు వచ్చేశానని తనుశ్రీ తెలిపింది. ఆ తర్వాత అదే సాంగ్ లో రాఖి సావంత్ నటించింది. “మీరు ఆ పాటను గమనిస్తే నన్ను ఒక్కసారి కూడా నానా పటేకర్ టచ్ చేయలేదు. తనుశ్రీ చెబుతున్నట్టు ఏమి జరగలేదు అని వెల్లడించారు రాఖి.

తనపై ఈ విధంగా విమర్శలు చేసినందుకుగాను రాఖి సావంత్ పై పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది తనుశ్రీ. “తనుశ్రీ పేరు, వ్యక్తిగతంగా దెబ్బ తీసేలా మాట్లాడినందుకు గానూ రాఖి సావంత్ పై పరువు నష్టం దావా వేసినట్టు” తనుశ్రీ తరపు న్యాయవాది తెలియజేసారు.