మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో రిలీజ్ చేసేందుకు కొణిదెల కంపెనీ సన్నాహకాల్లో ఉంది. అంతకుముందే దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ప్రచారం నిర్వహించేందుకు రకరకాల కార్యక్రమాలు డిజైన్ చేశారని తెలుస్తోంది.
పాన్ ఇండియా టార్గెట్ గా రిలీజ్ చేస్తున్న సైరా
ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 18న జరగాల్సి ఉన్నా 22 సెప్టెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే అంతకంటే ముందే ఈనెల 18న సైరా ట్రైలర్ ని అధికారికంగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో సైరా ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు కొందరు డిస్ట్రిబ్యూటర్లు సన్నాహకాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్ ని మెగా అభిమానులకు ఉచితంగానే చూపించనున్నారట. దాదాపు 270 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టే ప్రచారంలో స్పీడ్ మాత్రం కనిపించడం లేదు. అక్టోబర్ 2 సైరా డే అవుతుందా అవ్వదా? అన్నది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. ఇప్పటికే సైరా ట్రైలర్ వీక్షించిన ఉమైర్ సంధు ప్రశంసల వర్షం కురిపించడం పాజిటివ్ టాక్ ని క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టే సినిమాలో కంటెంట్ ఉంటే హిట్టవుతుందనే భావిద్దాం. బాలీవుడ్ లో పద్మావత్ 3డి లాంటి భారీ హిస్టారికల్ క్లాసిక్ ని జ్ఞప్తికి తెప్పించగలిగితే మన సైరా విజయం దక్కించుకున్నట్టే. ఏమాత్రం ఫెయిలైనా ఆ ప్రభావం కలెక్షన్లపై ఉంటుందనడంలో సందేహం లేదు.