ఆచార్య లో చరణ్ లుక్ వచ్చేసింది ..’సిద్ద’ లుక్‌ టెర్రిఫిక్‌

  హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. తండ్రి తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయి హీరోలుగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సినిమా బిజినెస్ కూడా పూర్తైయినట్టు సమాచారం. దాదాపు రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా నుంచి సిద్ధగా రామ్ చరణ్ లుక్‌‌ను రిలీజ్ చేసారు. తండ్రి తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయి హీరోలుగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చెర్రీ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్‌ను ఒక రోజు ముందు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు సినిమాలో 45 నిమిషాలకు పైగా ఉన్నట్టు సమాచారం.

ఆచార్య థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో ఇప్పటికే వరంగల్ శ్రీను రూ. 42 కోట్లకు ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, రాయలసీమ (సీడెడ్) కలిపి రూ. 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ రూ. 20 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఆచార్య సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో తొలిసారి పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండంపై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్.. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు.