మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘ఆచార్య’కు సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 11న సినిమాలో తొలిసాంగ్ ను విడుదల చేయబోతున్నారట. ఈ న్యూస్ బయటకు రాగానే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ తమ హీరోకు గతంలో అందించిన హిట్ సాంగ్స్ ను వైరల్ చేస్తూ, వాటికి మించినట్టుగా ఇది ఉంటుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చాలా రోజుల తరువాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాతో పాటు, యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఇక మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో చెర్రీకి జోడీగా పూజా హెగ్డే తళుక్కున మెరవనుంది. సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సాయుధ దళాల దుస్తుల్లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా తమ అభిమాన హీరో ఈ దుస్తుల్లో కనిపించడంతో మెగాస్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
దీంతో ఆచార్య సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాలో చిరు పాత్రపై ఇప్పుడు హాట్ టాఫిక్ నడుస్తుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా షూటింగ్ ఇల్లందులోని జేకె మైనింగ్స్‌లో జరగుతుంది. షూటింగ్ కోసం చిత్ర బృందం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి అనుమతులను తీసుకుంది. మార్చి 7 మార్చి 15 వరకుషూటింగ్ జరపనున్నారు. ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు