డే వన్ 40 కోట్లతో మెగా మేనియా
మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా: నరసింహారెడ్డి` తొలిరోజు వసూల్ ఎంత? అంటే తాజాగా ఆసక్తికర సమాచారం రివీలైంది. సైరా తెలుగు రాష్ట్రాల నుంచి 39కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. సీడెడ్-6.30కోట్లు, నైజాం-8.13కోట్లు, వైజాగ్-4.72కోట్లు, తూ.గో జిల్లా-5.34కోట్లు, ప.గో జిల్లా-4.10కోట్లు, నెల్లూరు-2.18కోట్లు, కృష్ణ-3.03కోట్లు.. గుంటూరు-5.05కోట్లు.. వసూలైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు 38.85కోట్లు వసూలైంది. ఇకపైనా దసరా సెలవుల్లో భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఉత్తరాది బెల్ట్ నుంచి ఎంత వసూలు చేసింది? అన్నదానిపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. అక్కడ దాదాపు 5 కోట్ల నెట్ వసూలైందని పలువురు చెబుతున్నా.. ఆ సంఖ్య ఇంకా పెరిగే వీలుందట. హిందీ చిత్రం వార్ వసూళ్లను షేర్ చేసుకోవడం సైరాకు ఇబ్బందికరంగా మారింది. అలాగే తమిళనాడులో 7-8కోట్లు.. కర్నాటకలో 9కోట్లు.. కేరళ లో 3కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. ఓవర్సీస్ లో 1మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. అంటే సుమారు 7కోట్లు ఓవర్సీస్ నుంచి వసూలైందని తెలుస్తోంది. దీనిని బట్టి సైరా తొలి రోజు 50 కోట్ల షేర్ క్లబ్ లో చేరినట్టేనని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై పూర్తిగా అధికారిక సమాచారం మరింత రివీల్ కావాల్సి ఉంది.