నాలుక కరుచుకుంటున్న ‘చాణక్య’నిర్మాతలు
యాక్షన్ హీరో గోపిచంద్ నటించిన ‘చాణక్య’ చిత్రం 5వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. దసరా శెలవులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఈ సీజన్ ఎడ్వాంటేజ్ సెట్ చేసుకోలేకపోయింది. అసలు భాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఓ మాదిరిగా కూడా ఫెరఫార్మ్ చేయలేక చతికిల పడింది.
చాణక్య రిలీజ్ కు మూడు రోజుల ముందే ‘సైరా’ చిత్రం విడుదలై అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకోవటం సగం దెబ్బకొట్టింది. దానికి తోడు సినిమా స్ఫై థ్రిల్లర్ అన్నారు కానీ ఆ ఎలిమెంట్స్ ఏమీ సినిమాలో కనపడవు. ఫస్టాఫ్ అంతా అసలు స్టోరీని వదిలేసి లవ్ సీన్స్ తో నడిపేసారు. సెకండాఫ్ లో అయినా పికప్ అవుతుందనుకుంటే అర్దం పర్దం లేని టెక్నాలిజీ తెలివి ఉపయోగిస్తూ హీరో బోర్ కొట్టిస్తాడు. దీంతో ‘చాణక్య’కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఈ సినిమాకు ప్లాఫ్ టాక్ వచ్చాక.. ‘సైరా’ అక్టోబర్ 2న వస్తుందని తెలిసి కూడా ‘చాణక్య’ టీమ్ 5వ తేదీని ఫిక్స్ చేసుకుని తప్పు చేసామని నిర్మాతలు నాలుక కరుచుకున్నారట. చేతులు కాలాక ఆకుల పట్టుకుంటే లాభమేంటి… అని గోపిచంద్ అభిమానులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సినిమా ఎంత బాగున్నా సాధారణ రోజుల్లో వచ్చే ఓపెనింగ్స్ కు, చిరంజీవి సినిమా బ్లాక్ టాక్ తెచ్చుకున్న నాలుగవ రోజునాడు వచ్చే ఓపెనింగ్స్ కు చాలా తేజా ఉంటుంది. అది ‘చాణక్య’ మొదటి రోజు వసూళ్లను చూస్తే అర్థమైపోతుంది.
కలెక్షన్స్ విషయానికి వస్తే…
6 రోజులకుగాను ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ.3.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా షేర్ రూ.3.9 కోట్లు, గ్రాస్ రూ.6.6 కోట్లు మాత్రమే వసూలైంది. చిత్ర ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం బ్రేక్ ఈవెన్ అమౌంట్ రూ.12 కోట్లని తెలుస్తోంది. సో.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం తప్పేలా లేవు.