100 కోట్ల షేర్ క్ల‌బ్‌లో `సైరా: న‌ర‌సింహారెడ్డి`

తెలుగు రాష్ట్రాల్లో 100కోట్లు

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. దాదాపు 300 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాగించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత జోరు చూపించ‌లేదు. ముఖ్యంగా ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మెగా మేనియా కొన‌సాగింది. ఇక్క‌డ పంపిణీదారులు సేఫ్ జోన్ కి చేరుకోనున్నార‌ని తెలుస్తోంది. సైరా చిత్రాన్ని అమ్మిన రేట్స్ తిరిగి రాబ‌ట్టేందుకు ఇంకో రెండ్రోజులు చాలు..నైజాం.30.. వైజాగ్ 14.40.. ఇప్ప‌టికే షేర్ కి కొన్న రేటుకు స‌రిపోయింది. రేపటి నుండి లాభాలు బాటలోకి వెళుతున్నారు. మిగతా జిల్లాల్లో 12 వ రోజుకి సేఫ్.. 13 వ రోజు నుండి లాభాలు బాటలో వుంటార‌ని తెలుస్తోంది.

మరో 14 కోట్లు వ‌సూలు చేస్తే అందరూ సేఫ్ అయిన‌ట్టేన‌న్న‌ది ఆ వార్త సారాంశం. ఇక మెగాస్టార్ చిరంజీవి రేంజ్ తెలుగు రాష్ట్రాల్లో 100కోట్ల‌కు త‌క్కువ కాదు అని ప్రూవ్ అవుతోంది. వంద కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టేందుకు 4 కోట్ల షేర్ ద‌క్కితే చాలు.

సైరా ప‌దోరోజు అలాగే ప‌ది రోజుల వ‌సూళ్లు ప‌రిశీలిస్తే..
నైజాం – 88 ల‌క్ష‌లు – టోట‌ల్ 30.13 కోట్లు
సీడెడ్ – 35 ల‌క్ష‌లు-17.53 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌ – 42 ల‌క్ష‌లు-14.45 కోట్లు
తూ.గో జిల్లా 10ల‌క్ష‌లు- 8.55 కోట్లు
ప‌.గో జిల్లా 9ల‌క్ష‌లు – 6.08కోట్లు
కృష్ణ జిల్లా – 10ల‌క్ష‌లు – 6.91కోట్లు
గుంటూరు జిల్లా – 10ల‌క్ష‌లు- 9.06కోట్లు
నెల్లూరు జిల్లా- 5.8ల‌క్ష‌లు 4.18కోట్లు

10వ రోజు టోట‌ల్ 2.20కోట్లు
10 రోజుల మొత్తం షేర్ 96.93కోట్లు వ‌సూలైంది.