దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. మంగళవారం నాడు ప్రీమియర్లకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా ఓవర్సీస్ లోనూ భారీగా ప్రీమియర్లకు ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషం తిప్పలు ఇబ్బంది పెడుతున్నాయన్నది తాజా సమాచారం.
అయితే చివరి నిమిషం టెన్షన్లు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయని తెలిసింది. అమెరికాకు చేరాల్సిన క్యూబ్ లు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. చాలా చోట్లకు ఇప్పటికే చేరుకున్నా కొన్నిచోట్లకు క్యూబ్ చేరకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కంగారులో ఉన్నారని చెబుతున్నారు. శనివారానికి చేరాల్సినవి ఇప్పటికీ చేరకపోవడం అన్నది కొణిదెల కంపెనీ పొరపాటు వల్లనే అని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సోమవారం సాయంత్రానికి లేదా మంగళవారానికి చేరినా ఆరోజు మధ్యాహ్నం (1 అక్టోబర్) 2గం.ల షో పడుతుందా లేదా? అన్న సందిగ్ధత నెలకొందట. లెవంత్ అవర్ టెన్షన్ తప్పేట్టు లేదన్న మాటా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇంతటి భారీ చిత్రం రిలీజ్ విషయంలో ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇంకా సైరా బృందం ప్రచారం హడావుడిలోనే ఉంది. రామ్ చరణ్- చిరంజీవి బృందం ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ప్రీరిలీజ్ వేడుకకు అటెండయ్యారు. ఈ వేడుకలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు అతిధులు పాల్గొన్నారు. కన్నడ నుంచి భారీగా మెగాస్టార్ అభిమానులు ఈ వేడుకకు ఎటెండయ్యారు.