ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద చక్కని ఓపెనింగులు సాధించింది. ఊహించిన దానికంటే మంచి టాక్ రావడం కలిసొస్తోంది. ఎక్కడ చూసినా సైరా మేనియా కొనసాగుతోంది. సైరా తొలి రోజు దూకుడు చూశాక.. తొలి వీకెండ్.. తొలి వారం భారీ వసూళ్లు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా డే -వన్ వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి. మెగాస్టార్ ఛరిష్మా ఏంటో మరోసారి రుజువైంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్త గ్రాస్, షేర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
ఏరియా వైజ్ గ్రాస్ లెక్కలు చూస్తే… ఆంధ్రా-33.8కోట్ల గ్రాస్.. నైజాంలో 12.2 కోట్ల గ్రాస్ ని సైరా వసూలు చేసింది. మొత్తంగా ఏపీ తెలంగాణ గ్రాస్ 52.6 కోట్లు. కర్నాటక-10.5కోట్లు..తమిళనాడు 1.3కోట్లు.. కేరళ 50లక్షలు.. ఇతర భారతదేశం 3.1కోట్లు.. ఇండియా వైడ్ 68కోట్లు.. అమెరికా, కెనడా 8.4కోట్లు మేర గ్రాస్ వసూలైంది. ఇతర ప్రపంచ దేశాల నుంచి 5కోట్ల గ్రాస్ వసూలైంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్త వసూళ్లు 81.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ షేర్ వివరాలు చూస్తే.. వైజాగ్ 4.64 కోట్లు.. తూర్పుగోదావరి-4.75 కోట్లు… పశ్చిమగోదావరి- 4.02 కోట్లు.. కృష్ణా-3.04 కోట్లు.. గుంటూరు 2.09 కోట్లు.. నెల్లూరు-2.09కోట్లు.. సీడెడ్ 5.54కోట్లు వసూలైంది. ఆంధ్రా నుంచి 23.6 కొట్లు ..నైజాం 8.14కోట్లు షేర్ వసూలైంది. కర్నాటక 6.39కోట్లు.. తమిళనాడు 60లక్షలు.. కేరళ 20లక్షలు.. ఇతర భారతదేశం 1.21 కోట్లు.. మొత్తం ఇండియా 46కోట్లు షేర్ వసూలైంది. అమెరికాల 4.2కోట్లు.. ఇతర ప్రపంచంలో 2కోట్లు వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా 52కోట్ల షేర్ వసూలు చేసింది. నెట్ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీ నైజాం 47.3కోట్ల నెట్ వసూలు చేయగా…. మొత్తం ఇండియాలో 60.6 కోట్లు కలెక్టయ్యింది.