సైరా నర్సింహారెడ్డికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
`సైరా నర్సింహారెడ్డి` రిలీజ్ ఆపాలంటూ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సైరా చిత్రం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తులు తుది తీర్పునిచ్చారు. సినిమా ను కేవలం వినోద పరంగా చూడాలి. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవ్వరూ చూపించరని కోర్టు తుది విచారణలో వ్యాఖ్యానించింది. సైరా రిలీజ్ కి లైన్ క్లియర్ చేసింది.
కేవలం సైరా చిత్రాన్ని మాత్రమే కాదు.. గతంలో చాలా బయోపిక్ చిత్రాల విషయంలో ఇలానే జరిగింది. కల్పిత పాత్రలతో చూపించడం చూస్తున్నదేనని అది మేకర్స్ విజ్ఞతకే వదిలేయాలని కోర్టు పేర్కొంది. గాంధీజీ, మొగల్ ల సామ్రాజ్యంపై తీసిన సినిమాల్ని అలానే తెరకెక్కించారని కోర్టు ప్రస్థావించింది. మొదట బయోపిక్ అని ఇప్పుడు చరిత్ర తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మాత కేతిరెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది.
పిటిషన్ దాఖలు చేసిన తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతి రెడ్డి తరపు లాయర్ వాదనల్ని కొట్టి పారేసింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో బయోపిక్ లను ఫిక్షనల్ గా చూపించడం మేకర్స్ ఆలోచనకే వదిలేసింది కోర్టు. మొత్తానికి సైరాకు అలా లైన్ క్లియరైంది. సరిగ్గా రిలీజ్ దశలో ఇప్పుడు సినిమా ను తాము అపలేమని కోర్టు పేర్కొనడం విశేషం.