అమీర్ ఖాన్ అలా అన్నాడా..మెగా ఫ్యాన్స్ షాక్

సైరా పై అమీర్ ఖాన్ కామెంట్, మెగా ఫ్యాన్స్ కు పండగ

తొలి స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రుపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.రీసెంట్ గా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి వీరవిహారం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించిన కబుర్లే. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటికే రాజమౌళి, మహేష్, సల్మాన్ వంటివారు సైరా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా చేరారు. ట్విట్టర్ వేదికగా ఆయన సైరా ట్రైలర్ బాగుందని, ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నానంటూ ట్వీట్ చేశారు. అదే సమయంలో ఆయన నేను చిరంజీవి కి పెద్ద అభిమానిని అని చెప్పడం మరో విశేషం. దాంతో చిరంజీవి అభిమానులంతా ఫిదా అయ్యిపోయి..ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.