బిగ్ బాస్ అంటే ముద్దులు …మురిపాలు … హగ్గులే
బిగ్ బాస్ 3 తెర వెనుక జరుగుతున్నా భాగోతాన్ని శ్వేతారెడ్డి బయటపెట్టింది . బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎంపిక చేస్తామంటూ స్టార్ మా ప్రతినిధులు తమని అభ్యన్తరకరమైన పలు ప్రశాలు అడిగారని , అందుకు తానూ , గాయత్రి గుప్తా ఆ ప్రతినిధుల వ్యవహార శైలిని తప్పుపట్టామని చెప్పారు . అయితే బిగ్ బాస్ ప్రారంభమై వారం రోజుల నుంచి స్టార్ మా లో ప్రసారమవుతుంది . అయితే శ్వేతారెడ్డి విశాఖ పట్టణములో ఈ విషయాన్ని మళ్ళీ తెర మీదకు తెచ్చారు .
స్టార్ మా ప్రతినిధి శ్యామ్ నాతో మాట్లాడిన తీరు కంపరం పుట్టించిందని ,మా బాస్ ను ఎలా సంతృప్తి పరుస్తారు ? 90 రోజులపాటు సెక్స్ లేకుండా వుండగలరా ? అంటూ పడే పడే అడిగాడని శ్వేతా రెడ్డి చెప్పారు . బిగ్ బాస్ షో మొత్తం సెక్స్ చుట్టూ తిరుగుతుందా అనిపిస్తుంది . సెక్స్ , ముద్దులు .. హగ్గుల గురించి పదే పదే ప్రస్తావించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె చెప్పారు . బిగ్ బాస్ వీటి చుట్టూ నడుస్తున్నట్టు వుంది .
ఇలాంటి షోను ప్రసారం కాకుండా ఆపాలనే ఉద్దశ్యంతోనే మా పోరాటాన్ని హైదరాబాద్ నుంచి విశాఖ పట్టణానికి మార్చామని శ్వేతారెడ్డి తెలిపారు . ఇలాంటి షో కి హోస్టుగా వున్నా నాగార్జున సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడో తెలపాలని ఆమె డిమాండ్ చేసింది . శ్వేతా రెడ్డికి మద్దతు గా పలువురు మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు .