Bigg boss 4: ఇక బిగ్ బాస్ చూడటం వేస్ట్.. విన్నర్ ఎవరో రాహుల్ సిప్లిగంజ్ రివీల్ చేసేశాడు

rahul sipligunj reveals the winner of bigg boss 4

బిగ్ బాస్ 4.. మిగితా సీజన్ల కన్నా.. ఈ సీజన్ హైప్ బాగా వచ్చింది. అందులోనూ ఈసారి ఓ షోకు సమంత హోస్ట్ చేయడం.. అఖిల్ కూడా రావడంతో బిగ్ బాస్ కు పాపులారిటీ పెరిగింది. అందులోనూ ఈసారి కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెరిగాయి. హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడవడం.. తర్వాత రెండు మూడు జంటల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుండటం.. లాంటివి కూడా షోకు బాగానే పాపులారిటీ తీసుకొస్తున్నాయి.

rahul sipligunj reveals the winner of bigg boss 4
rahul sipligunj reveals the winner of bigg boss 4

ఇక.. హౌస్ నుంచి ఇటీవలే అమ్మ రాజశేఖర్ వెళ్లిపోయాడు. ఈ వారం నామినేషన్లు కూడా చాలా ఫైర్ మీద జరిగాయి. అయితే.. ఇప్పుడే తమ అసలైన ఆటను ఆడటం మొదలు పెట్టారు కంటెస్టెంట్లు. ఏమాత్రం మొహమాటం లేకుండా.. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లను నామినేట్ చేస్తున్నారు. ఏమాత్రం సంకోచించడం లేదు.

అయితే.. ఈ సారి సీజన్ లో బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పాల్గొన్నాడు. అంటే.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ల ఇంటర్వ్యూలను ఆయన తీసుకుంటున్నాడు.

అయితే.. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారో రాహుల్ చెప్పేశాడు. ఈసారి సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ అవుతాడంటూ చెప్పేశాడు.

rahul sipligunj reveals the winner of bigg boss 4
rahul sipligunj reveals the winner of bigg boss 4

నిజానికి రాహుల్ కు ఇష్టమైన కంటెస్టెంట్లు నోయల్ అట. నోయల్ ను విన్నర్ గా చూడాలనుకున్నాడట. కానీ.. నోయల్ బయటికి వచ్చేయడంతో.. విన్నర్ అభిజీత్ అవుతాడని జోస్యం చెబుతున్నాడు. అభిజీత్ తో పాటు సోహెల్, అరియానా కూడా తన ఫేవరేట్ కంటెస్టెంట్లు అట. కానీ.. టైటిల్ మాత్రం అభిజీత్ గెలుస్తాడని పక్కా చెప్పేశాడు రాహుల్. చూద్దాం మరి.. రాహుల్ అంచనాలు నిజమవుతాయా? లేదా? అనేది.