బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డీ అంటే తెలియనివారంటు ఉండరు. టిక్ టాక్ వీడియోస్, డబ్ స్మాశ్ వీడియోస్ ద్వార ఫేమస్ అయిన ఆశు రెడ్డి మొదట సినిమాలో నటించే అవకాశం అందుకుంది.కానీ ఆ సినిమా వల్ల ఆశుకి మంచి గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో ఆశు పాల్గొనింది. ఈ సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే కొన్ని రోజులకే బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. ఆ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా టైటిల్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు బయట తిరుగుతూ పబ్బులు, పార్టీలు అంటు బాగా సందడి చేశారు. దీంతో ఆశు రెడ్డి క్రేజ్ బాగా పెరిగిపోయింది.
అయితే కొంతకాలానికే ఇద్దరు విడిపోయి జంటగా బయట ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత ఆశు రెడ్డి బుల్లితెర మీద ప్రసరమైన పలు టీవీ షోస్ లో సందడి చేస్తూ ఎప్పటిలాగే స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల ఆరబోతతో మరింత పాపులర్ అయ్యింది. ఆశు రెడ్డి తన గ్లామర్ తో సోషల్ మీడియాలో భారీగా ఫాలోయర్స్ ని పెంచుకుంది. ఈ క్రమంలో ఎక్స్ ప్రెస్ హరి ఆశు రెడ్డి మద్య లవ్ ట్రాక్ మొదలయ్యింది. ఎక్స్ ప్రెస్ హరికి ఆశు రెడ్డి ఒక కాస్ట్లీ బైక్ కూడా గట్టిగా ఇచ్చింది. దీంతో ఈ జంట మరింత పాపులర్ అయింది.
ఈ క్రమంలో ఆశుకి ఓటిటి లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో ఆశు రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. అంతే కాకుండా శివ ల్తో కూడా చాలా చనువుగా ఉండేది. ఈ సీజన్ లో ఆశు చాలా వారాలు బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగింది. అయితే టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆశ రెడ్డి ఇటీవల ఒక కోట్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో సద్గురు ప్రేమ అంటే ఎంటో వివరించాడు. ఎవరికి నచ్చినట్టు వారిని ఉండనివ్వడమే ప్రేమ.. మనకు నచ్చింది చేయమనడం ప్రేమ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆశు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ప్రేమ ఎలా మొదలై.. ఎలా అంతమవుతుందో తెలుసా?.. అందుకే ప్రేమించటం కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటూ సోలో బ్రతుకే సో బెటర్ అంటు వేదాంతాన్ని వల్లించింది.