“బిగ్ బాస్ 3” రద్దు చెయ్యాలంటూ హైకోర్టు లో కేసు
“బిగ్ బాస్3” వివాదం మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది . స్టార్ మా నాగార్జున హోస్టు గా నిర్వహిస్తున్న “బిగ్ బాస్ 3” ఇప్పుడు తెలంగాణ హైకోర్టు లో వుంది . ప్రజాప్రయోజనం దృష్టిలో పెట్టుకొని నిర్మాత దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి “బిగ్ బాస్ 3” రియాలిటీ షో ను రద్దు చెయ్యమని ఫిర్యాదు చేశారు . ఇప్పటికే ఈ షో బాధితులు యాంకర్ శ్వేతా రెడ్డి , గాయత్రి గుప్తా మీడియాలో తమకు న్యాయం చెయ్యమని నినదిస్తున్నారు . ఈ షో ముసుగులో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని , కాబట్టి దీనిని బ్యాన్ చెయ్యమని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు .
“బిగ్ బాస్ 3” వివాదం రోజురోజుకు రాజుకుంటూ నిర్వాహకులకు చెమటలు పట్టిస్తుంది . ఈ నెల 21న రాత్రి బిగ్ బాస్ షో ప్రసారం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు . బిగ్ బాస్ పై వస్తున్న ఆరోపణలు , విమర్శలపై ఈ షోలో పాల్గొనే వారు భయపడుతున్నట్టు తెలుస్తుంది . శ్వేతారెడ్డి , గాయత్రి గుప్తా చేసిన ఆరోపణలు … తమ కెరీర్ పై ప్రభావం చూపిస్తాయోమో అని సందేహిస్తున్నట్టు తెలుస్తుంది . అయితే ఈ షో పాలగోనే వారు అని 13 మంది పేర్లు ఇప్పటికే మీడియాలో వచ్చేశాయి . అయితే ఒక్క శ్రీముఖీ తప్ప అధికారికంగా ఎవరినీ ఎంపిక చేయలేదట. . ఈ వారాంతంలో ఫైనల్ లిస్టు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు .
ఈ నేపథ్యంలో జగదీశ్వర రెడ్డి ఈ షో గురించి హైకోర్టు లో కేసు వెయ్యడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది . అమ్మాయిలు శారీరక సంబంధానికి ఒప్పుకుంటేనే అవకాశం ఇస్తామని నిర్వాహకు చెప్పటం వల్ల , ఇది ఎలాంటి షో అర్థం చేసుకోవాలని , అందుకే బిగ్ బాస్ 3 రియాలిటీ షో ప్రసారం కాకుండా రద్దు చెయ్యాలని ఆయన కోర్టు కు విన్నవించుకున్నట్టు తెలిసింది .
ఈ విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా , పోలీస్ కేసు పెట్టినా , హై కోర్టు లో కేసు పెట్టినా , హోస్ట్ నాగరున మాత్రం స్పందించడం లేదు . ఇలాటి షో ను నాగార్జున ప్రాత్సహిస్తున్నాడా ” అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి . ఇంతకీ “బిగ్ బాస్ 3 ” షో 21న ప్రసారం అవుతుందా?