బిగ్ బాస్ హేమను సాగనంపి తమన్నాకు స్వాగతం పలికారు

బిగ్ బాస్ హేమను సాగనంపి తమన్నాకు స్వాగతం పలికారు

వివాదాలతో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పుడు సాఫీగానే సాగుతోంది . ఈ షోలో నాగార్జున హోస్ట్ కావడంతో దీనిపట్ల చాలామంది ఆసక్తిని కనబరుస్తున్నారు . ఈ షో మొదలై వారం రోజులు అయిపొయింది . గత రెండు మూడు రోజులుగా మొదట ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే చర్చ జరిగింది . రకరకాల పేర్లు వచ్చాయి . అయితే చివరకు ఊహించని విధంగా నటి హేమ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున అక్కినేని ప్రకటించారు . హేమ వారం గడవక ముందే బిగ్ బాస్ నాగార్జునను వదిలిపెట్టాల్చి వచ్చింది . గత వారం షో లో వచ్చిన ఓట్లను బట్టి హేమను పంపిస్తున్నట్టు నాగార్జున చెప్పారు .

హేమ వెళ్ళిపోగానే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు షో లో ప్రవేశిస్తారు ? అనే విషయం మీద కూడా టీవీ ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది . అయితే ఈ ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా వచ్చినట్టు నాగార్జున ప్రకటించి అందరినీ ఆశ్ఛర్యానికి గురి చేశారు . తమన్నా ఈమధ్య వార్తల్లో తరచుగా కనిపిస్తుంది . ఏ సమస్య మీద అయినా పోరాటం చేసే తమన్నా మొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి శాసన సభ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు . లోకేష్ ను ఓడించడానికి తాను నిలబడ్డట్టు తమన్నా ప్రకటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది . అయితే మంగళగిరిలో ఆమె విజయం సాధించకపోయినా , వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గెలవడం , లోకేష్ ఓడిపోడంతో .. తమన్నా .. తన పంతం నెగ్గినట్టు భావించింది , ఇప్పుడు బిగ్ బాస్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో ప్రవేశించి సందడి చేయబోతుంది .