యూ ట్యూబ్ లో కనిపించే స్వాతి నాయుడు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితురాలే. రొమాంటిక్ డైలాగులు..వీడియోలతో యువత ని మెప్పించిన స్వాతి నాయుడు యాంకర్ గాను రాణించింది. ఇక యూ ట్యూబ్ వీడియోలతో ఎంతగా పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి వృత్తికి దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్నే ఆస్వాదిస్తోంది. కాగా మే 10న స్వాతినా యుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సందర్భంగా స్వాతినాయుడు సంతోషం వ్యక్తం చేసింది. గత జీవితం ఎలా ఉన్నా! ప్రస్తుతం తల్లిగా ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. గతం గతహా కొత్తగా జీవితం ప్రారంభించాను. ఈ జీవితం ఇలాగే సాఫీగా సంతోషంగా సాగిపోవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. అలాగే సోషల్ మీడియా వేదికగా స్వాతి నాయుడు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వర్ధమాన నటి శ్రీరెడ్డి కూడా స్పందించింది. అందులో కొన్ని సెటైర్లు కూడా అల్లింది. నువ్వేమీ పెద్దింటి అమ్మాయి వి కాదు..మెగా ఫ్యామిలీ కి చెందిన దానికి కాదు.
అందుకే నీ పాప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాలేదని కామెంట్లు చేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్లగాను నెటి జనులు అక్షింతలు వేసారు. విష్ చేసిన దానికి పద్దతిగా చెప్పాలిగానీ…ఇందులోకి మెగా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నావ్…కొంచెమైనా బుర్రా బుద్ది జ్ఞానం ఉందా? అంటూ నెటి జనులు మండిపడ్డారు. ఇలాంటి చిల్లర విమర్శలు…చిల్లరు వ్యాఖ్యలు చేసే టాలీవుడ్ లో కనిపించకుండా పోయావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్నట్లు శ్రీరెడ్డి చెన్నైలో స్థిరపడిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచే టాలీవుడ్ అటెన్షన్ ని డ్రా చేస్తోంది.