హీరో సిద్ధార్థ్ కు దర్శకుడు సుశీ గణేశన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసారు. బెదిరిపంపులు రావటానకి కారణం సిద్దార్ద.. ‘మీటూ’ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలపటమే అని తెలుస్తోంది.
సిద్దార్ద.. ట్వీట్స్ తో ‘మీటూ’ సంఘటనలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయం షేర్ చేసుకుంటున్నారు. అలా చేసిన ఓ ట్వీట్ తో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
‘మీటూ’ ఉద్యమం స్పూర్తితో చాలా మంది ఇండస్ట్రీకి చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను, లైంగిక వేధింపులను బయిట పెడుతున్నారు. రీసెంట్ గా విరుంబుగిరేన్’,’తిరుట్టుపయలే’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సుశి గణేశన్ తనను వేధించారని నటి, రచయిత లీనా మణి మేఖలై ఆరోపించిన సంగతి తెలిసిందే.
‘యాంకర్‌గా చేసేటప్పుడు ఆయన్ను ఇంటర్వూ చేయటానికి వెళ్ళి వస్తూంటే తనకు లిప్ట్ ఇచ్చి …లైంగిక చేష్టలతో తనను విసిగించాడని చెప్పింది. ఒప్పుకోకపోవటంతో సుశి గణేశన్ తనను కారులో ఉంచి లాక్ చేశారు’ అని లీనా ఆవేదనతో ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ కి సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘నేను నీకు మద్దతుగా ఉంటాను లీనా. నీ గళం అందరికీ వినిపిస్తుంది. నీ ధైర్యం అందరికీ ఆదర్శవంతం’ అని ట్వీట్ చేశారు. ఈ నేపధ్యంలో సిద్ధార్థ్‌కు బెదిరింపులు వచ్చాయి.
ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా బయిటపెడుత…. ‘సుశి గణేశన్ వయసుపైబడిన నా తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. లీనాకు మద్దతుగా ఆమెవైపు ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. ఇప్పటికైనా ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి. నేను లీనాకు మద్దతుగానే ఉంటా. ’ అన్నారు.