అతి పిన్న వయసులో మరణించిన రైజింగ్ స్టార్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రికార్డులకెక్కాడు. అతడి మరణం అనుమానాస్పదం. అది హత్యనా? ఆత్మహత్యనా? అన్నది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అంతో ఇంతో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే సుశాంత్ సింగ్ ఏజ్ ఎంత.. పెళ్లి ఆలోచన లేదా? అంటే.. 34 వయసులో ఎంతో ఉత్సాహంగా పెళ్లికి రెడీ అవుతున్నాడని అతడి సోదరుడు పన్నా సింగ్ తెలిపారు. మరో ఐదారు నెలల్లో లేదా నవంబర్ లో అతడికి పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ఘటన. ఇప్పటికే పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆత్రంగానే ఉన్నారు. స్నేహితుల్లోనూ దీనిపై చర్చ సాగుతోంది. అయితే సుశాంత్ మనువాడే అమ్మాయి ఎవరు? అన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలీదు. కానీ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఈలోగానే అతడు ఊహించని విధంగా అనంతలోకాలకు పయనమయ్యాడు. అతడి మరణం కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా కలచివేసింది.