సుశాంత్ కి ఏయన్నార్.. ఇర్ఫాన్ ఖాన్ పోలిక!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రస్తుతం హాట్ టాపిక్. బాలీవుడ్ సహా అన్నిపరిశ్రమల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో పాటే సుశాంత్ సింగ్ మరణానికి ముందు చిచ్చోరే చిత్రంలో ఓ అరుదైన సన్నివేశం గురించిన వేడెక్కించే డిబేట్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
చిచ్చోరే చిత్రం ఆత్మహత్యలు సరికాదని సందేశంతో తెరకెక్కిన చిత్రం. ఇక ఇందులో ఓ సన్నివేశంలో సుశాంత్ కార్ లో వెళుతూ మార్గమధ్యలో అద్దంలోంచి బయటికి తొంగి చూస్తాడు. ఆకాశంలోకి చూస్తూ ఎంతో ఆహ్లాదకరమైన నవ్వు ముఖంతో కనిపిస్తాడు. అసలే సొట్టబుగ్గల సుందరాంగుడు కావడంతో ఆ సన్నివేశం అంతరార్థమేమిటా! అంటూ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే సేమ్ టు సేమ్ సన్నివేశాలు డార్క్ నైట్ చిత్రంలో హీత్ అనే నటుడిపైనా చిత్రీకరించారు. అలాగే ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియంలోనూ సేమ్ సీన్ ఉంటుంది. కార్ అద్దంలోంచి బయటికి చూస్తూ ఆకాశం వైపు తథేకంగా చూస్తూ కనిపిస్తారు వీళ్లు కూడా. ఆ మూడు సినిమాలు ఆయా నటుల మరణానికి ముందు నటించినవే కావడంతో అందరిలోనూ ఒకటే ఆసక్తి. అందుకే ఇలా పోలికను చూస్తున్నారు.
అదంతా సరే కానీ.. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇలానే కార్ లోంచి చిరునవ్వు ముఖంతో కనిపించిన ఫోటోతో సుశాంత్ ఫోటోని చేర్చి పోలిక చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏదో తెలీని ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతోంది. ఒక లెజెండ్ మరణానికి ముందు నటించిన సినిమాలో అలా కనిపించారు. ఇప్పుడు ట్యాలెంటెడ్ సుశాంత్ సింగ్ కూడా అలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు అంటూ పోలిక చెప్పేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు నెటిజనం.