Uday Kiran: ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా చిత్రం అనే సినిమాలో హీరోగా అవకాశం అందుకొని మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అనంతరం నువ్వు నేను మనసంతా నువ్వే వంటి సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు ఉదయ్ కిరణ్.
ఇలా ఈయన వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈయనకు సినిమా అవకాశాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఇలాంటి సమయంలోనే ఉదయ్ కిరణ్ నటన సామర్థ్యం ఆయనకున్న ఆదరణ చూసిన చిరంజీవి తన ఇంటి అల్లుడుగా చేసుకోవాలని భావించారు. ఇక తన పెద్ద కుమార్తె సుస్మితను ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఉదయ్ కిరణ్ కు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఇలాంటి సమయంలోనే ఈయనకు అతడు సినిమాలో నటించే అవకాశం కూడా లభించింది.
తాజాగా అతడు సినిమా నిర్మాత సీనియర్ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. అతడు సినిమాకు ముందుగా ఉదయ్ కిరణ్ అనుకున్నాము అదే సమయంలోనే చిరంజీవి కూతురుతో పెళ్లి ప్రకటన రావడంతో ఉదయ్ కిరణ్ డైరీ మొత్తం మెగా కుటుంబం చేతిలోకి వెళ్లిపోయిందని వాళ్లే తన డైరీ చూసుకునేవారని మురళి మోహన్ తెలిపారు. ఇక ఈ సినిమా ఫైనల్ అవుతుందనుకున్న సమయానికి ఏదో కన్ఫ్యూజన్లో మీకు డేట్స్ ఇచ్చాం కానీ ఉదయ్ కిరణ్ డేట్స్ లేవు అంటూ అల్లు అరవింద్ వంటి వాళ్లు తెలిపారు అందుకే మేము మహేష్ బాబుని ఎంపిక చేసుకున్నామని మురళీమోహన్ తెలిపారు.
ఇలా ఉదయ్ కిరణ్ డైరీ మెగా చేతిలోకి వెళ్లిన తరువాతనే ఆయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని ఆ తర్వాత తన కుమార్తె సుస్మితతో నిశ్చితార్థం జరిగినప్పటికీ కొన్ని కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకోవడంతో ఉదయ్ కిరణ్ కు ఒక సినిమా అవకాశం కూడా రాలేదని తెలుస్తోంది. ఇలా అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఉదయ్ కిరణ్ చివరికి సూసైడ్ చేసుకొని మరణించారు. ఇప్పటికీ ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి.