పెళ్లికి ముందు ఆత్మహత్య.. గుండె పగిలి అభిమాని మృతి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనాలు రేపుతున్న సంగతి తెలిసిందే. నెప్టోయిజం.. మాఫియా.. ఫేవరిజం సుశాంత్ ఆత్మహత్యకు కారణం అంటూ ఎవరికి వారు ఆగ్రహం వ్యక్తం చేయడం టాపిక్ గా మారింది.
అదంతా అటుంచితే సుశాంత్ సరిగ్గా పెళ్లికి ఇంకా ఐదారు నెలలు ఉందనగా ఇలా సూసైడ్ చేసుకోవడం అభిమానుల్ని తీవ్రంగా కలచి వేస్తోంది. తన ప్రేయసి రియా చక్రవర్తిని ఈ నవంబర్ లో పెళ్లాడేందుకు సుశాంత్ సిద్ధమవుతున్నాడు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఏర్పాట్లలో ఉన్నాయి. ఈలోగానే ఈ దారుణం చోటు చేసుకుంది. సుశాంత్ అందరాని లోకాలకు తరలి వెళ్లిపోయాడు. రియా చక్రవర్తి తీవ్ర శోకంలో మునిగిపోయింది. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి కృతి సనోన్ సైతం తన హృదయంలో ఒక భాగం సుశాంత్ తో ఉండిపోయిందంటూ ట్వీట్ చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ రూరల్ లో బరేలి గ్రామానికి చెందిన సుశాంత్ అభిమాని ఒకరు అతడి మరణ వార్తలు విని తీవ్రవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పదోతరగతి చదువుతున్న 16ఏళ్ల బాలుడు లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విలేజ్ లో విషాదం నింపింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. నేను చేసుకుంటే తప్పేంటి! అంటూ ఆ టీనేజర్ అమాయకంగా ఆ లేఖలో రాయడం గుండెను పిండేసింది.