63 మిలియ‌న్ల ట్వీట్ల‌తో ధోని రికార్డునే బ్రేక్ చేసిన ప‌వ‌ర్ స్టార్

power star

power starట్విట్ట‌ర్ లో స్టార్ల మ‌ధ్య వార్ గురించి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు ట్విట్టర్ పోకడలలో స‌రికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. 63 మిలియన్ ప్లస్ ట్వీట్లతో, ట్విట్టర్ లో బెస్ట్ ఫ్యాన్ డ‌మ్ ని ఆవిష్క‌రించారు. జోరుగా వైర‌ల్ అవుతున్న‌ ఎంఎస్ ధోని పదవీ విరమణ వార్తలను కూడా అధిగమించగలిగారు. ఈ ట్వీట్లు #PawanKalyanBdayCDP హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అయ్యాయి.

సీడీపీ సాధారణంగా కామన్ డిస్ ప్లే పిక్చర్. సెలబ్రిటీల అభిమానులు చాలా మంది తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ డెమిగాడ్స్  విష‌యంలో తమ అభిమానాన్ని, ప్రేమను చూపించడానికి ఈ సీడీపీని ఉప‌యోగిస్తున్నారు. ఆగస్టు 8 న ప‌వ‌న్ పుట్టినరోజు సందర్భంగా నెల‌కొల్పిన రికార్డు ఇది.

ఇటీవల సూప‌ర్ స్టార్ మహేష్ అభిమానులు కూడా ట్విట్టర్ ట్రెండ్స్‌లో ఇలాంటి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మ‌హేష్ అభిమానులు నిర్ణ‌యించిన‌ టార్గెట్ సంఖ్యలను ప‌వ‌న్ అభిమానులు అధిగమించి స‌రికొత్త రికార్డును నెల‌కొల్పారు. మహేష్ బాబుకు మెగా కుటుంబ హీరోల‌తో మంచి సంబంధాలున్నాయ‌నే విషయం తెలిసిందే. అయితే అభిమానం వేరే. సంబంధాలు వేరే.

స్టార్ల‌ అభిమానులలో మెజారిటీ పార్ట్ ఇలాంటి సంబంధాన్ని కొనసాగించరు. అయితే ఇటీవ‌ల హీరోల మ‌ధ్య శ‌త్రుత్వం ఉండ‌ద‌ని.. నిజ జీవితంలో స్నేహితులు అని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి పోటీ ప్ర‌పంచంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ బలాన్ని మరోసారి నిరూపించారు. ధోనీ .. మ‌హేష్ రికార్డుల్ని ప‌వ‌న్ అధిగ‌మించార‌న్న‌మాట‌.