బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతు సంచలనాలను సృష్టిస్తుంది.. ఆయన మరణించి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు నిజాలు వెతుకుతూనే ఉన్నారు.. ఇకపోతే ఈ కేసుని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐపీసీలో సెక్షన్ 302ని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. కాగా ఢిల్లీలోని ఎయిమ్స్, సీబీఐకి సమర్పించిన నివేదికలో సుశాంత్‌పై విష ప్రయోగం జరగలేదని, కానీ ఆయనది ఆత్మహత్యా, హత్యా అన్నది తాము నిర్ధారించలేమని పేర్కొంది. అలాగని సుశాంత్‌ని విష ప్రయోగం ద్వారా కాకుండా మరో రకంగా హత్య చేసి ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని పేర్కొంది..
ఇదిలా ఉండగా ఊపిరాడకే సుశాంత్ మరణించారని అందువల్ల అది కచ్చితంగా ఆత్మహత్య అని నిర్ధారించలేమని ఎయిమ్స్ వైద్యుడు ఒకరు చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. దీంతో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెక్షన్ 302ని చేర్చాలని యోచిస్తున్నట్టుగా సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కేసులో పితాని, సుశాంత్ కుక్ నీరజ్ కూడా సాక్షులుగా మారే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసి విచారిస్తోంది. కాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో రోజులు గడిచేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతుండటం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఇకపోతే సుశాంత్ చనిపోయే ముందురోజు అతని ఇంట్లో పార్టీ జరిగిందనే విషయంపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగిన విషయం తెలిసిందే.
ఇక జూన్ 14 వ తారీఖు రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో రియాని తన ఇంటిలో సుశాంత్ డ్రాప్ చేయడాన్ని స్వయంగా చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారన్న విషయాన్ని నేషనల్ మీడియా వెల్లడించింది.. కానీ రియా మాత్రం పొంతన లేకుండా సమాధానం ఇస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో సుశాంత్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు రియాతో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరిన్ని నిజాలు లోతుగా రాబట్టడానికి ప్రస్తుతం ఉన్న ఎఫ్ఐఆర్ కు అదనంగా సెక్షన్ 302ను చేరుస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగన్నట్లు తెలుస్తుంది.. మరి ఇప్పుడైనా సుశాంత్ మరణంలోని నిజనిజాలు బయటకు వస్తాయో రావో అని ఫ్యాన్స్ బెంగపడుతున్నారట..