రజనీ‘దర్బార్‌’లో ఏం జరుగుతుందో తెలుసా

సౌతిండియా సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ రాజకీయాలు ప్రక్కన పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మొన్న సంక్రాంతికి పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కించేసారు. తమిళ స్టార్‌ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఓకే చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్బార్‌ అనే టైటిల్‌ను నిర్ణయించటంతో మంచి క్రేజ్ వచ్చింది. టైటిల్‌ లోగోతో పాటు సినిమాలో రజనీ లుక్‌ను కూడా రివీల్ చేసింది చిత్రయూనిట్‌.

ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్దమవుతోంది. బుధవారం నుంచి ‘దర్బార్‌’ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు.ముప్పై రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం.

రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్వరాలందించనున్నాడు.