సూప‌ర్ స్టార్ మ‌హేష్ శ్రీ‌రాముడిగానా?

మ‌హేష్‌తో రాజ‌మౌళి పాన్ ఇండియా సినిమా

సూప‌ర్ స్టార్ మ‌హేష్ శ్రీ‌రాముడిగా న‌టిస్తున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. అభిమానుల సోష‌ల్ మీడియాల్లో మ‌హేష్ ఒక‌వేళ శ్రీ‌రాముడుగా క‌నిపిస్తే ఎలా ఉంటుంది? అన్న ఊహాచిత్రాన్ని డిజైన్ చేసి ప్ర‌చారం చేస్తుండ‌డం వేడెక్కిస్తోంది.

ఇటీవ‌ల ఎస్.ఎస్.రాజ‌మౌళితో మ‌హేష్ సినిమాని ప్ర‌క‌టించ‌గానే అది క‌చ్ఛితంగా పాన్ ఇండియా కేట‌గిరీ సినిమా అని అభిమానులు భావించారు. అది కూడా బాహుబ‌లి త‌ర‌హాలో ఏదైనా డిఫ‌రెంట్ కాన్సెప్టునే ఎంచుకుంటార‌ని భావిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా రామాయ‌ణం జ‌క్క‌న్న తెర‌కెక్కించాల‌ని.. అందులో మ‌హేష్ శ్రీ‌రాముడిగా న‌టించాల‌న్న వాద‌న‌ను తెరపైకి తెచ్చారు. అంతేకాదు.. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో మ‌హేష్ శ్రీ‌రాముడి గెట‌ప్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. ఇందులో విల్లంబులు అందుకున్న శ్రీ‌రాముడిగా మ‌హేష్ క‌నిపిస్తున్నారు. ఇది మార్ఫింగ్ చేసిన ఫోటోనే అయినా అందులో ఆ పోలిక అద్భుతంగానే సెట్ట‌యింద‌నే చెప్పాలి. ఆర‌డుగుల ఆజానుభాహుడైన మ‌హేష్ ఈ పాత్ర‌కు సూట‌బుల్.

ఇక పోతే అల్లు రామాయ‌ణంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ శ్రీ‌రాముడిగా న‌టిస్తాడ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ శ్రీ‌రాముడు పాత్ర‌ధారిని ఎంపిక చేయాల్సి వ‌స్తే ఇటు మ‌హేష్ కానీ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కానీ సూట‌బుల్ అన్న చ‌ర్చా ఇదివ‌ర‌కూ సాగింది. ఇప్ప‌టికి మ‌హేష్ న‌టించాల‌న్న‌ది అభిమానుల కోరిక‌. అయితే అది కార్య‌రూపం దాల్చేకే ఖాయం అని అనుకోవాల్సి ఉంటుంది. అయితే మ‌హేష్ తో రాజ‌మౌళి ఒక భారీ యాక్ష‌న్ చిత్రాన్ని ప్లాన్ చేశార‌ని గుస‌గుస‌లు మ‌రోవైపు వేడెక్కిస్తున్నాయి.